
వచ్చే నెలలో బరిలోకి సైనా...
హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నవంబర్‌లో తిరిగి బరిలోకి దిగనుంది. ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆమె చైనా ఓపెన్‌లో ఆడనున్నట్టు సైనా తండ్రి హర్‌వీర్ సింగ్ తెలిపారు. వచ్చే నెల 12 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ ఐదో ర్యాంకర్ సైనా... 2014లో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.
అరుుతే నవంబర్ 6న జరిగే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి చెందిన అథ్లెట్స్ కమిషన్ సమావేశానికి తను గైర్హాజరు కానుంది. మరోవైపు ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితులైనందుకు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) అభినందించింది.