The International Olympic Committee
-
వచ్చే నెలలో బరిలోకి సైనా...
హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నవంబర్‌లో తిరిగి బరిలోకి దిగనుంది. ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆమె చైనా ఓపెన్‌లో ఆడనున్నట్టు సైనా తండ్రి హర్వీర్ సింగ్ తెలిపారు. వచ్చే నెల 12 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ ఐదో ర్యాంకర్ సైనా... 2014లో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. అరుుతే నవంబర్ 6న జరిగే అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి చెందిన అథ్లెట్స్ కమిషన్ సమావేశానికి తను గైర్హాజరు కానుంది. మరోవైపు ఐఓసీ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యురాలిగా నియమితులైనందుకు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) అభినందించింది. -
ఫిఫాలో సంస్కరణలు తేవాలి: బాచ్
లాసానే: అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో కఠినమైన సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అభిప్రాయపడ్డారు. 2002 వింటర్ ఒలింపిక్స్‌ను సాల్ట్ లేక్ సిటీకి ఇచ్చే విషయంలో వెలుగు చూసిన ఓటుకు నోటు వ్యవహారంకన్నా ప్రస్తుత ఫిఫాలో కొనసాగుతున్న సంక్షోభం ఎక్కువని అన్నారు. ‘ఫిఫాలో సంస్కరణలు అమలయ్యేందుకు మేం ప్రోత్సహిస్తాం. దీనికోసం వారు ప్రయత్నిస్తే చాలా మంచిది. నిజానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమే అయినా ప్రస్తుతం చాలా అవసరం’ అని బాచ్ అన్నారు.