సింధు సిల్వర్ మెడల్ గెలిచినా...
రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టింది పీవీ సింధు. ఒలింపిక్స్‌లో సింధు అద్భుతమైన పోరాటపటిమను చూపినప్పటికీ.. ఆమె వరల్డ్ ర్యాంకు ఏమీ మారలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆమె పదో స్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఒలింపిక్స్‌లో అంచనాల మేరకు ఆడలేకపోయిన భారత షట్లర్ సైనా నేహ్వాల్ ర్యాంకు మరింత దిగజారింది. తాజా ప్రదర్శన కారణంగా స్థానాలు పడిపోయిన సైనా తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఒలింపిక్స్‌లో విఫలమైన భారత షట్లర్ల జోడీ గుత్తా జ్వాలా, అశ్వని పొన్నప్ప కూడా నాలుగు స్థానాలు దిగజారి 26 ర్యాంకుకు పరిమితమయ్యారు. అయితే, పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ మాత్రం తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని అతను 10వర్యాంకులో నిలువగా.. మరో భారత షట్లర్ అజయ్ జయరాం కూడా ర్యాంకును మెరుగుపరుచుకొని 22వస్థానంలో నిలిచాడు.