
ఏడో ర్యాంకుకు సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంచలనం పి.వి.సింధు ర్యాంకింగ్స్ లోనూ దూసుకెళ్తోంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఆమె రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని ఏడో ర్యాంకుకు ఎగబాకింది. చైనా ఓపెన్ టైటిల్ సాధించిన సింధు ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో మెరుగైన ర్యాంకుతో ఆమె సూపర్ సిరీస్ ఫైనల్ ఈవెంట్‌లో ఆడేందుకు అర్హత సంపాదించింది.
దుబాయ్‌లో ఈ నెల 14 నుంచి జరిగే ఈ టోర్నీలో కేవలం టాప్-8 క్రీడాకారిణులు మాత్రమే బరిలోకి దిగుతారు. సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకుకి చేరింది. తొలి మూడు స్థానాల్లో వరుసగా తై జు రుుంగ్ (చైనీస్ తైపీ), మారిన్ (స్పెరుున్), రత్చనోక్ (థాయ్‌లాండ్) ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఒక ర్యాంకును కోల్పోరుు 13వ స్థానంలో నిలువగా... సమీర్ వర్మ 13 ర్యాంకుల్ని మెరుగుపర్చుకొని 30వ ర్యాంకుకు ఎగబాకాడు.