
వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. సింధు విజయం 2018 ఏడాదిని చిరస్మరణీయం చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రం గర్వించదగ్గ ఈ తెలుగుతేజం రాబోయే కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.