AP CM YS Jagan Congratulations To PV Sindhu - Sakshi
Sakshi News home page

PV Sindhu-CM Jagan: పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం జగన్‌

Published Sun, Jul 17 2022 1:37 PM | Last Updated on Sun, Jul 17 2022 7:36 PM

AP CM YS Jagan Congratulations To PV Sindhu - Sakshi

సాక్షి, అమరావతి: సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ విజేతగా నిలిచిన పీవీ సింధును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకున్న సింధును సీఎం జగన్‌ కొనియాడారు. ఆమె ఘనత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై పీవీ సింధు గెలుపొందింది.

వాంగ్ జి యిపై 21-9, 11-21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్‌లో ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించిన సింధు.. రెండో సెట్‌లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు.. ఈ ఏడాదిలో తొలి  సూపర్‌ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా, సింధుకు ఈ ఏడాది ఇది మూడో టైటిల్‌. అంతకుముందు సయ్యద్‌ మోదీ, స్విస్‌ ఓపెన్లను గెలుచుకుంది. ఆమెకు ఇది సింగపూర్‌ ఓపెన్‌ తొలి టైటిల్‌.
చదవండి: సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement