![Roger Federer beats Alexander Zverev - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/16/feed.jpg.webp?itok=RXPo93rb)
సీజన్ ముగింపు టెన్నిస్ టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ‘బోరిస్ బెకర్ గ్రూప్’లో భాగంగా అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7–6 (8/6), 5–7, 6–1తో నెగ్గి రెండో విజయాన్ని నమోదు చేశాడు.
ఈ టోర్నీ చరిత్రలో ఫెడరర్ సెమీస్‌కు చేరుకోవడం 14వసారి కావడం విశేషం. ‘పీట్ సంప్రాస్ గ్రూప్’ నుంచి దిమిత్రోవ్ (బల్గేరియా) రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment