
మెల్‌బోర్న్: అద్వితీయ విజయాలతో ఆస్ట్రేలియా పర్యటనను మరపురానిదిగా మార్చుకున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి... ఓ అరుదైన చిత్రంతో దానిని మరింత గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. భార్య అనుష్క శర్మతో కలిసి శనివారం ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని వీక్షించేందుకు వెళ్లిన అతడు... రాడ్ లేవర్ ఎరీనాలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను కలుసుకున్నాడు.
ఈ మేరకు ‘ఎప్పటికీ గొప్పగా నిలిచే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓ అద్భుతమైన రోజు. ఇక్కడి వేసవికి చక్కటి ముగింపు’ అంటూ ఫొటోను ట్విట్టర్‌లో ఉంచాడు. ‘ముగ్గురు దిగ్గజాలు... ఒక ఫొటోలో’ అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు సైతం ఓ ఫొటోను ట్విట్టర్‌లో పెట్టారు. కోహ్లి దంపతులు అంతకుముందు టోపీలు ధరించి ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), షపవలోవ్ (కెనడా) మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment