రఫెల్ నాధల్
పారిస్ : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్ లో నాదల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ మయామి మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోవడంతో రెండో ర్యాంకుకు పడిపోయాడు. దీంతో నాదల్‌కు తొలి ర్యాంకు దక్కింది. ప్రస్తుతం నాదల్ 8770 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఫెడరర్ (8670) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment