No1 rank
-
స్టీల్ తయారీలో నంబర్ 1 కావాలి
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో భారత్ స్టీల్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యక్తం చేశారు. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఉక్కు లేదా 'మేడ్ ఇన్ ఇండియా' ఉక్కును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు, ప్రస్తుతం చైనా తర్వాత ముడి స్టీల్ తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఎన్ఎండీసీ, ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత్ స్టీల్ విషయంలో నికర దిగుమతిదారు నుంచి నికర ఎగుమతిదారుగా అవతరించినట్టు చెప్పారు. తలసరి స్టీల్ వినియోగం 2013-14లో 57.8 కిలోలు ఉంటే, అది ఇప్పుడు 78 కిలోలకు పెరిగిందన్నారు. ఉక్కు రంగంలో అధిక కర్బన ఉద్గారాల విడుదలపై ఆందోళన వ్యక్తం చేసిన సింధియా, 2030 నాటికి ఈ స్థాయిలను 30 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ తయారీని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. -
నాదల్.. నంబర్ వన్
పారిస్ : స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ఏటీపీ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్ లో నాదల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ మయామి మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోవడంతో రెండో ర్యాంకుకు పడిపోయాడు. దీంతో నాదల్కు తొలి ర్యాంకు దక్కింది. ప్రస్తుతం నాదల్ 8770 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఫెడరర్ (8670) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. -
మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు
కోల్‌కతా: టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన 178 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీస్‌తో పాటు పాకిస్థాన్ వద్ద ఉన్న నెంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేగాక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాక్‌ను భారత్ వెనక్కునెట్టి మళ్లీ నెంబర్‌వన్‌గా నిలిచింది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా ఈ ఘనత సాధించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. పాక్ చరిత్రలో తొలిసారి నంబర్‌వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్‌ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు విరాట్ సేన న్యూజిలాండ్‌పై గెలిచి ఆ ర్యాంక్‌ను లాగేసుకుంది.