
రోజర్ ఫెడరర్
కాలిఫోర్నియా: డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ ఇండియన్ వెల్స్ టైటిల్ దిశగా ముందంజ వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 7–5, 6–1తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. ఈ ఏడాది ఫెడరర్‌కిది వరుసగా 16వ విజయం కావడం విశేషం. 2006 తర్వాత ఈ స్విస్ దిగ్గజం ఓ సీజన్ ఆరంభంలో 16 వరుస విజయాలు నమోదు చేయడం ఇదే ప్రథమం. సెమీఫైనల్లో కొరిక్ (క్రొయేషియా)తో ఫెడరర్ ఆడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కొరిక్ 2–6, 6–4, 7–6 (7/3)తో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment