
‘తనతో మాట్లాడిన ఆ క్షణాలు నిజంగా అద్భుతం’ అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌పై అభిమానం చాటుకున్నాడు. బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆ భావనను మాటల్లో చెప్పలేను. చిన్ననాటి నుంచి అతడి ఆటను చూస్తున్నాను. అంతకుముందు రెండుసార్లు ఫెదరర్‌ను కలిశాను. కొన్నేళ్ల క్రితం సిడ్నీలో తను ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో నేను అక్కడికి వెళ్లాను. ఇటీవల తనను కలిసినపుడు ఆ విషయాన్ని గుర్తుచేశాడు. ప్రతీ మ్యాచ్‌కు తను ఎలా సన్నద్ధమవుతాడు.. గెలుపు కోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తాడు వంటి ప్రశ్నలు అడుగుదామం అనుకున్నా. కానీ అతడే రివర్స్‌లో నన్ను ప్రశ్నించడం మొదలెట్టాడు. ఫెదరర్ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తి కూడా’ అని ఫెడరర్ గురించి కోహ్లి చెప్పుకొచ్చాడు.
కాగా చారిత్రక విజయాలతో ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన అనంతరం కోహ్లి తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీని వీక్షించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాడ్ లేవర్ ఎరీనాలో స్విస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా.. ‘ఎప్పటికీ గొప్పగా నిలిచే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓ అద్భుతమైన రోజు. ఇక్కడి వేసవికి చక్కటి ముగింపు’ అంటూ ఫెడరర్‌తో దిగిన ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇక.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో కోహ్లి సేన విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment