పారిస్: పురుషుల టెన్నిస్‌లో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20) రికార్డు... అత్యధిక వారాల పాటు నంబర్‌వన్‌గా ఉన్న (310 వారాలు) రికార్డును తాను బద్దలు కొట్టగలనని సెర్బియా స్టార్ జొకోవిచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగానే తాను వీడ్కోలు పలుకుతానని జొకోవిచ్ అన్నాడు. ప్రస్తుతం ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో... స్పెయిన్ స్టార్ నాదల్ 19 టైటిల్స్‌తో రెండో స్థానంలో ... 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న జొకోవిచ్ ఈ వారంతో ఆ హోదాలో 282 వారాలను పూర్తి చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment