grand slam titles
-
గర్జించిన సెర్బియా సింహం.. టెన్నిస్ చరిత్రలో ఒకే ఒక్కడు (ఫొటోలు)
-
#NovakDjokovic: సెర్బియా యోధుడి చరిత్ర.. టెన్నిస్‌లో కొత్త రారాజు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు. ► జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ► ఇక జొకోవిచ్ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ► రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ► ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్ టైటిల్ కొడితే మాత్రం మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7-1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6-3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7-5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. One of the best speeches after winning a grand slam Special achievement, special speech NEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic pic.twitter.com/zcwbd4Up6X — Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023 🏆🇷🇸#RolandGarros | @DjokerNole pic.twitter.com/sopyII3GfQ — Roland-Garros (@rolandgarros) June 11, 2023 A legendary moment ✨#RolandGarros @DjokerNole pic.twitter.com/IdT4LWqqjO — Roland-Garros (@rolandgarros) June 11, 2023 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title. ⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB — Roland-Garros (@rolandgarros) June 11, 2023 చదవండి: French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ -
అతడో అద్భుతం!
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ పాపులర్ డైలాగ్‌కు రఫేల్ నాదల్ ఓ ఉదాహరణ. 19 ఏళ్ళ టీనేజ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఎర్రమట్టి కోర్టులో నాదల్ తొలిసారి అడుగుపెట్టినప్పుడు ఆ టెన్నిస్ అద్భుతాన్ని ముందే ఎంత మంది పసిగట్టారో తెలియదు కానీ, 36వ ఏట రికార్డుల ఆసామిగా మారిన ఇవాళ ఆయన గురించి ఎవరికీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. పట్టుదల, క్రమశిక్షణ ఆలంబనగా 2005లో మొదలైన ఆ మేజిక్ మొన్న ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ కొనసాగడం అభిమానులకు మరపు రాని అనుభవం. 2010 నుంచి వరుసగా రెండు గ్రాండ్ స్లామ్‌లు గెలవని రఫా తన 36వ ఏట తన సొగసైన ఆటతీరులో ఆ విన్యాసం చేసి చూపారు. వేధిస్తున్న ఎడమ పాదపు నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు తీసుకొని మరీ గత రెండువారాల్లో 7 మ్యాచ్‌లాడారు. ఫైనల్లో వరుస సెట్లలో 23 ఏళ్ళ నార్వే కుర్రాడు కాస్పర్ రూడ్‌పై అలవోకగా గెలిచారు. 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించారు. కరోనా కష్టం, పక్కటెముకల్లో స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో 6 వారాలు రాకెట్ ముట్టలేని బాధ, ఎర్రమట్టి కోర్టుల్లో సన్నాహక టోర్నమెంట్లలో పాల్గొనలేని వైనం, తిరగబెట్టిన ఎడమ పాదం గాయం... ఇవన్నీ పళ్ళబిగువున భరించి రఫా (నాదల్) టెన్నిసే ఊపిరిగా కదిలారు. జకోవిచ్ సహా టాప్ 10 ఆటగాళ్ళలో నలుగురిని దాటుకొని, ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచారు. ఆ టైటిల్ గెలిచిన అతి పెద్ద వయస్కుడయ్యారు. గతంలో మరో ఇద్దరు (2017 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫెదరర్, 1982 ఫ్రెంచ్ ఓపెన్‌లో విలాండర్) మాత్రమే ఇలా టాప్ 10లో నలుగురిని ఒక గ్రాండ్ స్లామ్లో ఓడించారనేది గమనార్హం. ఇప్పటికి 18 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ బరిలో దిగితే, 14 సార్లు టైటిల్ గెలిచి, తాను ఎర్ర మట్టి కోర్టులో కింగ్‌నని నిరూపించారు. అందుకే ఇది ఓ అద్భుతం. ఓ చరిత్ర. ప్రతి రంగంలో క్షణా నికో కొత్త తార మఖలో పుట్టి పుబ్బలో పోతున్న ఈ రోజుల్లో నాదల్ సుదీర్ఘకాలంగా సత్తా చాటి, సిసలైన టెన్నిస్ స్టార్‌గా నిలిచారు. ఒక్క ఫ్రెంచ్ ఓపెన్లోనే 115 సార్లు బరిలోకి దిగితే 112 సార్లు గెలిచి, 97 శాతం విజయాలు నమోదు చేసిన ఘనత ఆయనది. ప్రత్యర్థులైన తోటి టెన్నిస్ స్టార్లు ఫెదరర్, జకోవిచ్‌లను మించిన ప్రతిభ, గౌరవనీయ వర్తనతో రఫా ప్రత్యేక స్థానం సంపాదించారు. శారీరకంగా బాధల పాలైనా, తీవ్రంగా శ్రమించి గంటల కొద్దీ ఆడి ఓడినా – వాటిని తట్టుకొని ప్రతిసారీ నేలకు కొట్టిన బంతిలా నాదల్ పైకి లేచిన తీరు ఆటగాళ్ళకే కాదు... జీవనపోరాటంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమే. గెలుపు ఓటములను నిర్ణయించేవి పరిస్థితులు కాదు... మన క్రమశిక్షణ, ఆట పట్ల మన వైఖరి. సొంత అంకుల్ అయిన మరో టెన్నిస్ ఆటగాడు టోనీ నాసిరకం కోర్టుల్లో, తీసికట్టు బంతులతో కఠోర శిక్షణనిచ్చినప్పుడే ఆ పాఠం నాదల్ వంటబట్టించుకున్నారు. అతి కొద్దిమందే అగ్రస్థానానికి చేరుకోగలుగుతారనే స్పృహతో, చిన్న చిన్న విజయాలతో తృప్తిపడకుండా ముందుకు సాగారు. వేధిస్తున్న గాయాల వల్ల ఆటకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చి పలుమార్లు కన్నీటి పర్యంతమైనా, ప్రతిసారీ యోధుడిగా తిరిగొచ్చారు. ఈ ఏడాదీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ముందూ అదే పరిస్థితి. కానీ, ఇప్పుడు వరుసగా ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లు గెలిచారు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్ల దిశగా అడుగులు వేస్తున్నారు. పాదాల ఎముకలను శిథిలం చేసే అనారోగ్యాన్ని అధిగమించి వాటిలోనూ ఇలాగే గెలిస్తే, అది మరో రికార్డు. ఒకటీ రెండు కాదు... ఏకంగా 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా పురుషుల్లో నాదల్‌దే ఇప్పుడు రికార్డు. తోటి స్టార్లు జకోవిచ్, ఫెదరర్ల (20 స్లామ్ల) కన్నా రెండడుగులు ఆయన ముందున్నారు. సెర్బియాకు చెందిన అపూర్వ ప్రతిభావంతుడు జకోవిచ్ ఈ ఏడాదో, ఆ తర్వాతో ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చు. రికార్డులు చెరిగిపోవచ్చు కానీ, టెన్నిస్ క్రీడాంగణంపై నాదల్ వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోనిది. మైదానంలో ప్రతిభే కాదు... మానవీయ బాహ్యవర్తనా మరపురానిది. అయిదంతస్తుల అపార్ట్మెంట్లో కలివిడిగా బతికిన ఉమ్మడి కుటుంబ విలువలతో పెరిగిన ఆయన ఒక్కోసారి మన భారతీయ ఉమ్మడి కుటుంబాలకూ, విలువలకూ సన్నిహితుడిగా అనిపిస్తారు. స్వీయప్రచారం, ప్రతిదానికీ చప్పట్లు, తక్షణలబ్ధి కోరుకోవడం ఆధునిక ప్రపంచ లక్షణానికి భిన్నంగా, తాత్త్విక దృష్టితో జీవితాన్ని నాదల్ చూసే తీరు ప్రత్యేకమైనది. జీవితంలో బాధ, నష్టం అనివార్యమనీ, అవీ జీవితంలో భాగమనీ ఎరుక ఆయనది. ఆయన ప్రతిభకు ఆ సమభావం, క్రమశిక్షణ కవచాలు. నేటికీ నిత్య పోరాటస్ఫూర్తి ఆయన పాశుపతాస్త్రమైంది. గెలుపు ఓటములను సమంగా స్వీకరిస్తూ, శారీరక బాధను అంగీకరిస్తూ, స్వీయ నియంత్రణ కోల్పోకుండా మెలగడం ఈ ఆటగాడిని ఆల్‌టైమ్ గ్రేట్‌ను చేసింది. 2011లో వెలువడ్డ ‘రఫా – మై స్టోరీ’ ఆత్మకథ చదివినా, ఆయన సుదీర్ఘ ప్రయాణం చూసినా ఇదే అర్థమవుతుంది. మరి ఏ ఇతర టెన్నిస్ ఆటగాడు కానీ, ఈ శతాబ్దపు అత్యుత్తమ అథ్లెట్లలో కొందరైన టైగర్ వుడ్, మైకేల్ ఫెల్ప్స్, ఉసేన్ బోల్ట్, సెరీనా విలియమ్స్ లాంటివారు కానీ – తమ ఆటల్లో నాదల్ స్థాయిలో ఆధిపత్యం చలాయించలేదని విశ్లేషకుల మాట. ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ అపూర్వమైన ఆటతీరును మరోసారి చూసిన స్పెయిన్ రాజు సంతోషంలో ఒకటే అన్నారు – ‘స్పెయిన్ చరిత్రలో అత్యుత్తమ అథ్లెట్ నాదల్. రాబోయే తరాలు ఆయనకు నీరాజనాలు పడతారు. టెన్నిస్ ప్రపంచానికి ఆయన మహారాజు’. అది సత్యం. నాదల్ ఓ అద్భుతం. ఆయన పట్టుదల, పరిశ్రమ అనేక విధాల ఆదర్శం! -
Rafael Nadal: మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు!
French Open 2022- Winner Rafael Nadal: మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్లో 22వ ‘గ్రాండ్’ టైటిల్ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నార్వేకు చెందిన ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌పై ఐదో సీడ్ నాదల్ 6–3, 6–3, 6–0తో విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాదల్ పేరిట పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! ►1: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా నాదల్ (36 ఏళ్ల 2 రోజులు) రికార్డు సృష్టించాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆండ్రెస్ గిమెనో (స్పెయిన్; 1972లో 34 ఏళ్ల 10 నెలలు) పేరిట ఉండేది. 🚫 Trying a drop shot against @RafaelNadal is never a good idea -- find out why with our Shot of the Day by @oppo 🎥#RolandGarros | #InspirationAhead pic.twitter.com/tfnK8YrvMO — Roland-Garros (@rolandgarros) June 5, 2022 ►8: నాదల్ 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రమంలో ఎనిమిదిసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్పై మూడుసార్లు, డొమినిక్ థీమ్‌పై రెండుసార్లు, సోడెర్లింగ్, పుయెర్టా, ఫెరర్, వావ్రింకా, కాస్పర్ రూడ్లపై ఒక్కోసారి విజయం సాధించాడు. ►23: నాదల్ 14సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రమంలో తన ప్రత్యర్థులకు కోల్పోయిన మొత్తం సెట్ల సంఖ్య. ♦2008, 2010, 2017, 2020లలో అతను ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. ♦2007, 2012, 2018లలో ఒక్కో సెట్... 2014, 2019లలో రెండు సెట్లు... 2005, 2006, 2011, 2022లలో మూడు సెట్లు... 2013లో అత్యధికంగా నాలుగు సెట్లు చేజార్చుకున్నాడు. ✅ Rafa 🆚 Ruud ✅ Double delight for France 🇫🇷 ✅ 1️⃣4️⃣ for @RafaelNadal Look back at Day 15 with the Best Moments of the Day by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoments pic.twitter.com/IPfdgyMB2w — Roland-Garros (@rolandgarros) June 5, 2022 ►112: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ చరిత్రలో నాదల్ గెలిచిన మొత్తం మ్యాచ్‌లు. ►22: నాదల్ నెగ్గిన ఓవరాల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్‌కాగా... 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 2 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. 2️⃣2️⃣ in '22 -- a look back at how @RafaelNadal reached a new record for career Grand Slams: 1️⃣4️⃣ #RolandGarros 2️⃣ @Wimbledon 4️⃣ @usopen 2️⃣ @AustralianOpen pic.twitter.com/hq1HPD9uRL — Roland-Garros (@rolandgarros) June 5, 2022 చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్..! -
నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్.. జొకోవిచ్ దిగిరానున్నాడా!
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎంత మొండిగా వ్యవహరించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోకుండానే ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు అనుమతిస్తామని ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ విషయంలో జోకో విభేదించడం వివాదాస్పదంగా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, జొకోవిచ్ మధ్య మొదలైన వివాదం కోర్టును కూడా తాకింది. అయితే కోర్టులోనూ జొకోవిచ్‌కు చుక్కెదురవడం.. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్‌ను మూడేళ్ల పాటు ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడకుండా నిషేధించడం సంచలనంగా మారింది. అలా గ్రాండ్‌స్లామ్ ఆడకుండానే వివాదాస్పద రీతిలో జొకోవిచ్ వెనుదిరిగాడు. చదవండి: చరిత్ర సృష్టించిన నాదల్.. హోరాహోరి పోరులో మెద్వెదెవ్పై సంచలన విజయం ఇదంతా గతం.. ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ విషయంలో సెర్బియా స్టార్ దిగిరానున్నాడని సమాచారం. వ్యాక్సిన్ వేయించుకోవడానికి జొకోవిచ్ ఒప్పుకున్నట్లు.. అతని జీవిత కథ రాస్తున్న డానియెల్ ముక్స్ ఒక ప్రకటన చేయడం ఆసక్తి కలిగించింది.''జొకోవిచ్ ఉన్నపళంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి కారణం.. రఫెల్ నాదల్'' అని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను నాదల్ గెలవడం ద్వారా తన ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్‌ను వేసుకున్నాడు. ప్రస్తుతం నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా ఉన్నాడు. దీంతో నాదల్ రికార్డును బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో జొకోవిచ్ వ్యాక్సిన్ వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో నాదల్ రికార్డును బ్రేక్ చేయగల సత్తా ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకరు రోజర్ ఫెదరర్.. మరొకరు జొకోవిచ్. గాయాల కారణంగా టెన్నిస్‌కు దూరంగా ఉన్న ఫెదరర్ సాధిస్తాడన్న నమ్మకం లేదు. అయితే ఫామ్ పరంగా చూస్తే జొకోవిచ్‌కు మాత్రం సాధ్యమవుతుంది. జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో ఫెదరర్‌తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు? జొకోవిచ్ వ్యాక్సిన్ విషయంలో వెనక్కు తగ్గడానికి నాదల్ రికార్డును బ్రేక్ చేయాలన్న కారణం మాత్రమే కాదు. దీనివెనుక మరొకటి కూడా ఉంది. ఇకపై టెన్నిస్‌లో ఏ టోర్నమెంట్ అయినా ఆటగాళ్లకు వ్యాక్సిన్ తప్పనిసరి అని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య స్పష్టం చేసింది. రానున్న వింబుల్డన్, యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ వ్యాక్సిన్ తీసుకున్న ఆటగాళ్లనే అనుమతి ఇస్తామని పేర్కొన్నాయి. దీంతో జొకోవిచ్ దెబ్బకు దిగిరానున్నాడు. ఒకవేళ ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుంటే మాత్రం తనను తానే నష్టపరుచుకున్నట్లు అవుతుందని.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ కల నెరవేరదనే ఉద్దేశంతోనే జొకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. చదవండి: Novak Djokovic: కోవిడ్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో జకోవిచ్..! Another chapter is written 🏆@RafaelNadal defeats Daniil Medvedev 2-6 6-7(5) 6-4 6-4 7-5 to win his second #AusOpen title in an epic lasting five hours and 24 minutes. ⁰ 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/OlMvhlGe6r — #AusOpen (@AustralianOpen) January 30, 2022 -
అటు 20...ఇటు 18 వేటలో...
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌కు అద్భుత ముగింపు ఇచ్చే సమయం వచ్చింది. టైటిల్ వేటలో ఇద్దరు దిగ్గజ క్రీడాకారులు సర్వశక్తులూ ఒడ్డేందుకు సన్నద్ధమయ్యారు. నేడు జరిగే తుది పోరులో 12 సార్లు చాంపియన్, రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ తలపడనున్నాడు. ఇక్కడ విజయం సాధిస్తే పలు అరుదైన ఘనతలు ఆయా ఆటగాళ్ల ఖాతాలో చేరతాయి. తనకు కోటలాంటి ఎర్రమట్టి కోర్టులో ఫైనల్ చేరిన ప్రతీ సారి విజేతగా నిలిచిన నాదల్ మళ్లీ గెలిస్తే అతని ఖాతాలో 13వ ఫ్రెంచ్ ఓపెన్ చేరుతుంది. పైగా రోలండ్ గారోస్‌లో అతను సరిగ్గా 100 విజయాలు పూర్తి చేసుకుంటాడు. అన్నింటికి మించి 20వ గ్రాండ్‌స్లామ్ విజయంతో రోజర్ ఫెడరర్ సరసన నిలుస్తాడు. ఇక జొకోవిచ్ గెలిస్తే అతని ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్ చేరుతుంది. దిగ్గజాల గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వరుస 20–19–18గా మారుతుంది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో డిస్క్వాలిఫై కావడం మినహా ఆడిన మిగతా 37 మ్యాచ్‌లలో జొకోవిచ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సిట్సిపాస్‌పై సెమీ ఫైనల్లో 6–3, 6–2, 5–7, 4–6, 6–1తో ఐదు సెట్ల పాటు కొంత పోరాడి గెలిచాడు. జొకోవిచ్ తన కెరీర్లో ఒకే ఒక ఫ్రెంచ్ ఓపెన్ సాధించగా... అదీ 2016లో నాదల్ మూడో రౌండ్లోనే గాయంతో తప్పుకున్న ఏడాది వచ్చింది. ఇద్దరి మధ్య 55 మ్యాచ్‌లు జరగ్గా...నాదల్ 26 గెలిచాడు. జొకోవిచ్ 29 గెలిచి ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం నాదల్ 6–1తో ముందంజలో ఉన్నాడు. -
ఆ రెండు రికార్డులను నేను సవరిస్తా: జొకోవిచ్
పారిస్: పురుషుల టెన్నిస్‌లో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20) రికార్డు... అత్యధిక వారాల పాటు నంబర్‌వన్‌గా ఉన్న (310 వారాలు) రికార్డును తాను బద్దలు కొట్టగలనని సెర్బియా స్టార్ జొకోవిచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన ఆటగాడిగానే తాను వీడ్కోలు పలుకుతానని జొకోవిచ్ అన్నాడు. ప్రస్తుతం ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలి స్థానంలో... స్పెయిన్ స్టార్ నాదల్ 19 టైటిల్స్‌తో రెండో స్థానంలో ... 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న జొకోవిచ్ ఈ వారంతో ఆ హోదాలో 282 వారాలను పూర్తి చేసుకున్నాడు. -
జైకోవిచ్...
► కెరీర్ స్లామ్’ సాధించిన సెర్బియా స్టార్ ► ఈ ఘనత అందుకున్న ఎనిమిదో ప్లేయర్ ► ఎట్టకేలకు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ హస్తగతం ► ఫైనల్లో ఆండీ ముర్రేపై విజయం ► వరుసగా 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అరుదైన ఘనత జోకర్ కాదు... ఇప్పుడతను ‘కింగ్’. ఏక కాలంలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను చేత్తోపట్టిన టెన్నిస్ ప్రపంచపు రారాజు. పోయినచోటే వెతుక్కోవాలని అంటారు. నొవాక్ జొకోవిచ్ విషయంలో అదే జరిగింది. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో ‘కెరీర్ స్లామ్’ ఘనతను సాధించే అవకాశం దక్కినా ఈ సెర్బియా స్టార్‌కు నిరాశే ఎదురైంది. అయితే నాలుగో ప్రయత్నంలో మాత్రం అనుకున్నది సాధించాడు. గతేడాది తుది సమరంలో వావ్రింకాను తక్కువ అంచనా వేసి బోల్తా పడినా... ఈసారి అలాంటి తప్పిదం చేయలేదు. ఫైనల్ ప్రత్యర్థి ఆండీ ముర్రేపై స్ఫూర్తిదాయక విజయం సాధించి ‘కెరీర్ స్లామ్’ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రీడాకారుడిగా నిలిచాడు. పారిస్: ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న ‘ఫ్రెంచ్ ఓపెన్’ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-1, 6-2, 6-4తో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీలో 2012, 2014, 2015లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న జొకోవిచ్... నాలుగో ప్రయత్నంలో విజేతగా అవతరించి తొలిసారి ‘ఫ్రెంచ్’ చాంపియన్‌గా నిలిచాడు. ఈ విజయంతో జొకోవిచ్ కెరీర్ స్లామ్ (టెన్నిస్ సర్క్యూట్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) ఘనతను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా ఏకకాలంలో వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గిన మూడో క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ ఆండీ ముర్రేకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఫైనల్ ఆడుతున్న ముర్రే తొలి సెట్‌ను నెగ్గడంతో జొకోవిచ్‌కు మరోసారి నిరాశ తప్పదా అనిపించింది. అయితే వెంటనే తేరుకున్న జొకోవిచ్ రెండో సెట్ నుంచి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను అదే జోరులో సెట్‌ను నెగ్గాడు. మూడో సెట్లో జొకోవిచ్ జోరు మరింత పెరిగింది. ఈ సెట్లోనూ రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ వెనుదిరిగి చూడలేదు. నాలుగో సెట్లో ముర్రే కాస్త పోటీనిచ్చినా మళ్లీ రెండుసార్లు బ్రిటన్ స్టార్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని జొకోవిచ్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ► అత్యధికంగా 12వ ప్రయత్నంలో ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్ 11వ ప్రయత్నంలో ఈ టైటిల్ సాధించాడు. ► జిమ్ కొరియర్ (అమెరికా-1992లో) తర్వాత వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ► మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఓడి నాలుగోసారి ఈ టైటిల్‌ను నెగ్గిన మూడో ప్లేయర్‌గా జొకోవిచ్ నిలిచాడు. గతంలో ఫెడరర్, జెరోస్లావ్ డ్రోబ్నీ మాత్రమే ఇలా చేశారు. ► అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా) సరసన జొకోవిచ్ సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. ఫెడరర్ (17 టైటిల్స్) తొలి స్థానంలో ఉండగా... పీట్ సంప్రాస్ (14 టైటిల్స్), రాఫెల్ నాదల్ (14 టైటిల్స్) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. మళ్లీ నిరాశే... గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో జొకోవిచ్ చేతిలో ముర్రే ఓడిపోవడం ఇది ఐదోసారి. గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగుసార్లు ముర్రే ఓడిపోయాడు. ‘కెరీర్ స్లామ్’ వీరులు... ఫ్రెడ్ పెర్రీ (బ్రిటన్), డాన్ బడ్జ్ (అమెరికా), రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా). వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్స్ విజేతలు... డాన్ బడ్జ్ (1938-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), రాడ్ లేవర్ (1962, 1969-ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్), జొకోవిచ్ (2015 వింబుల్డన్, యూఎస్ ఓపెన్-2016 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ 1971 తర్వాత ఫ్రాన్స్ జంటకు టైటిల్... మహిళల డబుల్స్ విభాగంలో మ్లాడెనోవిచ్-కరోలినా గార్సియా (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో మ్లాడెనోవిచ్-గార్సియా ద్వయం 6-3, 2-6, 6-4తో మకరోవా-వెస్నినా (రష్యా) జోడీపై గెలిచింది. 1971లో గెయిల్ చాన్ఫ్రెయు-ఫ్రాంకోయిజ్ దుర్ జంట తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన జోడీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ఫెలిసియానో లోపెజ్-మార్క్ లోపెజ్ (స్పెయిన్) జంట గెల్చుకుంది. ఫైనల్లో ఈ జోడీ 6-4, 6-7 (6/8), 6-3తో బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) ద్వయంపై నెగ్గింది. ఫలితంగా 26 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఓ స్పెయిన్ జోడీ ఖాతాలో పురుషుల డబుల్స్ టైటిల్ చేరింది. రోలాండ్ గారోస్‌లో తొలిసారి కొత్త అనుభూతికి లోనవుతున్నాను. ఇదో ప్రత్యేక క్షణం. నా కెరీర్లోనే అత్యుత్తమం. మా ఫైనల్ చూసేందుకు ఇంత మంది ప్రేక్షకులు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కోర్టు, మీరు నా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అందుకే ఈ మట్టిపై నా హృదయం పరుస్తున్నాను. ఇలా బొమ్మ గీసి తనను అనుకరించేందుకు అనుమతి ఇచ్చిన మాజీ చాంపియన్ గుస్తావో కుయెర్టన్కు కృతజ్ఞతలు. -జొకోవిచ్ -
‘సోగ్గాడి’ విజయం వెనక....
ఆండ్రీ అగస్సీ... ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన టెన్నిస్ స్టార్. సోగ్గాడుగా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. స్టెఫీగ్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలో అన్ని మూలలా పెద్ద సెలబ్రిటీ హోదా... కానీ వీటన్నింటి వెనక, ఈ విజయం వెనక పెద్ద కష్టాన్నే అధిగమించిన ధైర్యం, ధీరత్వం ఉన్నాయి. అందరికీ తెలిసిన అగస్సీ అరుదైన కెరీర్‌స్లామ్ సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడు. తన ఆటతీరుతోనేగాక, భిన్నమైన ఆహార్యంతో అభిమానుల్ని అలరించిన అందగాడు. కానీ.. అగస్సీ జీవితంలో మరో కోణముంది. అదే.. స్పాండిలిస్తియాసిస్. ఈ వ్యాధి ఉన్నవారికి వెన్నెముక కింది భాగాన ఉన్న నరాల మధ్య గ్యాప్ తక్కువగా ఉండి, నడుస్తున్నప్పుడు నరాలు ఒకదానికొకటి తగిలి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నిటారుగా నిలబడలేరు. చక్కగా నడవలేరు. ఇక గెంతడం, పరుగులు పెట్టడం గురించి చెప్పాల్సిన పనేలేదు. క్రీడాకారుడు కావాలనుకున్న ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లు తెలిస్తే సహజంగా ఆ ఆలోచనే విరమించుకుంటారు. బుద్ధిగా చదువుకొని ఏ ఉద్యోగంలోనో స్థిరపడాలనుకుంటారు. కానీ, అగస్సీ అలా చేయలేదు. కసితో ముందుకు సాగాడు. కఠోర సాధనతో సమస్యను దూరంగా పారదోలాడు. పసి ప్రాయంలోనే.. మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ అగస్సీకి ముగ్గురు సంతానంలో చిన్నవాడిగా జన్మించిన ఆండ్రీ అగస్సీని టెన్నిస్ స్టార్ చేయాలని చిన్నప్పుడే నిర్ణయించాడు తండ్రి. ఇందుకోసం పసిప్రాయంలోనే రాకెట్ చేతికందించాడు. బాలుడైన ఆండ్రీతో సామర్థ్యానికి మించిన కసరత్తులు చేయించాడు. తొమ్మిదేళ్ల వయసులోనే అతని కన్నా ఎన్నో ఏళ్లు పెద్దవారైన ఆటగాళ్లతో ఆడించాడు. బహుశా! ఇంతటి కఠినమైన పరిస్థితులే ఆండ్రీని రాటుదేల్చివుంటాయేమో. 13 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు టెన్నిస్ కోచింగ్ అకాడమీలో చేరాడు. అక్కడ అగస్సీ ఆటతీరు గమనించిన శిక్షకుడు అతనికి ఫీజు కూడా అక్కర్లేదని ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. అకాడమీ నుంచి బయటికి వచ్చాక జూనియర్ స్థాయి నుంచి 1986లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారాడు. ఆ ప్రస్థానం 2006 వరకు సాగింది. కానీ, ఈ ఇరవై ఏళ్ల కెరీర్లో అగస్సీ ముళ్లబాటలోనే నడిచాడు. నిద్రలేని రాత్రులు.. 16 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఆటగాడిగా.. ఆడిన తొలిమ్యాచ్‌లోనే విజయం సాధించిన అగస్సీ ఆపై ఎన్నో విజయాలు చవిచూశాడు. దిగ్గజాలను ఓడించిన ఆనందం వెనుక ఎంతో విషాదం ఉంది. స్పాండిలోలైతిస్ కారణంగా వచ్చే నొప్పితో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా ఏం చేసినా భరించలేని నొప్పి. రాత్రిపూట బెడ్‌పై ఎక్కువసేపు పడుకోలేకపోయేవాడు. మధ్యరాత్రి నేలపైకి మారేవాడు. తలను చిన్నపిల్లాడిలా పొట్టలో పెట్టుకొని దగ్గరికి ముడుచుకునేవాడు. తెల్లవారితే ఒక్కసారిగా లేవలేకపోయేవాడు. అందుకోసం వన్, టూ, త్రీ.. అంటూ అంకెలు లెక్కపెట్టుకొని శక్తినంతా కూడదీసుకొని లేచి నిలబడేవాడు. ఆపై ప్రతి పనికీ ముందు అగస్సీ తన శరీరంతో పెద్ద కుస్తీయే పట్టాల్సివచ్చేది. అలాంటి స్థితి నుంచి కోర్టులో అడుగుపెట్టాక తనదైన షాట్లతో విరుచుకుపడేవాడు. కోర్టులో ఎక్కువగా వెనక్కి జరుగుతూ ఆడడం ద్వారా తన లోపాన్ని అధిగమించేవాడు. ఎనిమిది గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన అగస్సీకి ఈ సమస్య ఉన్నట్లు ఎవరికీ తెలియలేదు. చివరికి 2006లో యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లో ఓడిపోయి రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా తానే స్వయంగా ఈ విషయం వెల్లడించాడు. - కంచర్ల శ్యాంసుందర్ -
జొకోవిచ్ కోచ్‌గా బెకర్
బెల్గ్రేడ్: వచ్చే ఏడాది మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోవాలని.. మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గాలనే లక్ష్యంలో భాగంగా సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ జర్మనీ దిగ్గజం బోరిస్ బెకర్‌ను తన ప్రధాన కోచ్‌గా నియమించుకున్నాడు. ఇంతకాలం ప్రధాన కోచ్‌గా ఉన్న మరియన్ వజ్దా స్థానంలో బెకర్ వస్తాడు. అయితే కోచ్‌ల బృందంలో వజ్దాతోపాటు మిల్జాన్ అమనోవిచ్, గెబార్డ్ ఫిల్ గ్రిటిష్ కూడా కొనసాగుతారని ప్రస్తుతం ప్రపంచ రెండో ర్యాంకర్‌గా ఉన్న జొకోవిచ్ తెలిపాడు. 46 ఏళ్ల బెకర్ తన కెరీర్లో ఆరు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో కలిపి మొత్తం 64 టోర్నమెంట్లలో విజేతగా నిలిచాడు. వచ్చే ఏడాదిలో జనవరి 13న మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి జొకోవిచ్‌తో కలిసి బెకర్ పనిచేస్తాడు. జొకోవిచ్, సెరెనాలకు ఐటీఎఫ్ పురస్కారాలు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 2013 సంవత్సరానికి జొకోవిచ్, సెరెనా విలియమ్స్‌లను వరల్డ్ చాంపియన్స్‌గా ప్రకటించింది. జొకోవిచ్‌కిది వరుసగా మూడో పురస్కారం కాగా సెరెనా ఖాతాలో నాలుగోసారి చేరింది.