
‘మ్యాచ్ ఫర్ ఆఫ్రికా’ పేరిట ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌కు భారీ స్పందన లభించింది. ఆఫ్రికాలోని పేద విద్యార్థుల చదువుకు చేయూతనిచ్చేందుకు ఫెడరర్ ఫౌండేషన్ సాన్‌జోస్‌లో ఈ చారిటీ మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ మ్యాచ్‌ను 15,000 మంది అభిమానులు ప్రత్యక్షంగా తిలకించడంతో రూ. 16 కోట్ల 21 లక్షలు సమకూరాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా ప్లేయర్ జాక్ సాక్, ఎన్‌బీసీ టీవీ ప్రముఖ యాంకర్ సావన్నా గుత్రి ఈ మ్యాచ్‌లో పాల్గొన్నారు. డబుల్స్‌లో బిల్‌గేట్స్‌తో జతకట్టిన ఫెడరర్ 2–0తో సోక్–గుత్రి జంటను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment