కోచ్‌తో ప్రేమపెళ్లి.. శుభవార్త చెప్పిన టెన్నిస్‌ స్టార్‌ | Petra Kvitova Announces Pregnancy Set To Miss Australian Open, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Petra Kvitova Pregnancy: అభిమానులకు శుభవార్త చెప్పిన టెన్నిస్‌ స్టార్‌.. ఆటకు దూరం

Published Tue, Jan 2 2024 12:55 PM | Last Updated on Tue, Jan 2 2024 3:00 PM

Petra Kvitova Announcing Pregnancy Set To Miss Australian Open - Sakshi

చెక్‌ రిపబ్లిక్‌ టెన్నిస్‌ స్టార్‌, వింబుల్డన్‌ మాజీ చాంపియన్‌ పెట్రా క్విటోవా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌-2024కు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ప్రస్తుతం తాను గర్భవతినని.. అందుకే ఆటకు విరామం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

కొత్త సంవత్సరం సందర్భంగా తాను తల్లి కాబోతున్న శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సోనోగ్రామ్‌ ఫొటోను చూపిస్తూ భర్త జిరి వనెక్‌తో కలిసి ఉన్న దృశ్యాలను ఈ సందర్భంగా క్విటోవా షేర్‌ చేసింది. ఈ ఏడాది వేసవిలో తమ ఇంట్లోకి బుజ్జాయి రానుందంటూ హర్షం వ్యక్తం చేసింది. 

జీవితంలోని కొత్త దశను పూర్తిగా ఆస్వాదించడానికే కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా 33 ఏళ్ల పెట్రా క్విటోవా రెండుసార్లు వింబుల్డన్‌ విజేతగా నిలిచింది. 2011లో మారియా షరపోవాను ఓడించి.. 2014లో ఉజెనీ బౌచర్డ్‌ను మట్టికరిపించి టైటిల్స్‌ సాధించింది.

అదే విధంగా.. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇక 2019లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన క్విటోవా నయోమి ఒసాకా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ఇక పెట్రా క్విటోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తనకు కోచ్‌గా వ్యవహరించిన జిరి వనెక్‌తో 2019 నుంచి డేటింగ్‌ చేసిన ఆమె గతేడాది అతడిని పెళ్లాడింది. ఈ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా జనవరి 14- 28 వరకు ఆస్ట్రేలియా ఓపెన్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement