టైటిల్‌ను సాధించిన అనంతరం వొజ్నియాకి ఆనందం
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ టోర్నీలో రెండో సీడ్, డెన్మార్క్ క్రీడాకారిణి వొజ్నియాకి కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో వొజ‍్నియాకి 7-6(7/2), 3-6, 6-4 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి హలెప్(రొమేనియా)పై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. మరొకవైపు ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్‌ను సాధించిన క్రీడాకారిణిగా అరుదైన ఘనతను వొజ్నియాకి సొంతం చేసుకుంది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న వొజ్నియాకి.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో వొజ్నియాకి విజృంభించి పదునైన సర్వీస్‌లను సంధించింది. దాంతో తడబాటకు లోనైన హలెప్.. వరుస పాయింట్లను కోల్పోయి సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా చేజార్చుకుంది. ఇది హలెప్‌కు మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాగా, మూడుసార్లు రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. 2014, 2017ల్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరినా హలెప్ విజేతగా నిలవకలేకపోయింది.మరొకవైపు 2009, 2014 సంవత్సరాల్లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి టైటిల్ సాధించడంలో విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment