
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, రొమేనియా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హలెప్ ఫైనల్లోకి ప‍్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో హలెప్ 6-3, 4-6, 9-7 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్‌ను ఓడించి తుది పోరుకు సిద్దమైంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హలెప్ కడవరకూ పోరాడి విజయం సాధించింది.
తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్‌లో ఓటమి పాలైంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో సెట్‌లో హలెప్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును సొంతం చేసుకోవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే తుది పోరులో వొజ్నియాకితో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment