హాలెప్ కు షాక్ | Simona Halep knocked out in first round by America's Shelby Rogers | Sakshi
Sakshi News home page

హాలెప్ కు షాక్

Published Mon, Jan 16 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:21 AM

హాలెప్ కు షాక్

హాలెప్ కు షాక్

మెల్బోర్న్:ఈ సీజన్ ఆరంభపు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్లో నాల్గో సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్(రొమేనియా)కు ఆదిలోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ లో హాలెప్ తొలి రౌండ్లోనే  ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన పోరులో  హాలెప్ 3-6, 1-6 తేడాతో అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ చేతిలో ఓటమి పాలైంది. గంటా 15 నిమిషాలు పాటు జరిగిన పోరులో షెల్బీ రోజర్స్ కు హాలెప్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది.

 

ఏకపక్షంగా సాగిన రెండు సెట్లను రోజర్స్ తిరుగులేని ఆధిక్యాన్ని చెలాయించి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. రెండు వారాల క్రితం జరిగిన బ్రిస్బేన్ టోర్నీలో టాప్-10 క్రీడాకారిణి బౌచర్డ్పై రోజర్స్ సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంచితే గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్లో కూడా హాలెప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇక్కడ గమనార్హం.

మరొకవైపు బ్రిటన్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ముర్రే 7-5,7-6(7/5),6-2 తేడాతో మార్చెన్కోపై విజయం సాధించి శుభారంభం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement