ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం | Vandeweghe stuns kerber in australia open by 6-2, 6-3 to reach quarter final | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం

Published Sun, Jan 22 2017 7:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం

ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలన విజయం నమోదైంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే, రెండో ర్యాంకు ఆటగాడు నొవాక్ జొకోవిచ్లు ఇంటి దారి పట్టగా..  తాజాగా మహిళల సింగిల్స్ లో ప్రపంచ నంబర్ వన్, జర్మనీ స్టార్ ఎంజెలిక్ కెర్బర్  ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన నాల్గో రౌండ్ పోరులో  కోకో వాందివెగీ 6-2, 6-3 తేడాతో కెర్బర్ కు షాకిచ్చింది.

 

ఈ టోర్నీలో అతికష్టం మీద నాల్గో రౌండ్ వరకూ వచ్చిన కెర్బర్.. వాందివెగీ ధాటికి తలవంచింది. ఏకపక్షంగా సాగిన పోరులో వాందివెగీ సునాయాసంగా విజయం సాధించింది క్వార్టర్లోకి ప్రవేశించింది. గతేడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ తరువాత సెరెనా విలియమ్స్ నుంచి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న కెర్బర్.. ఈ ఏడాది ఆరంభపు ఆస్ట్రేలియా ఓపెన్ లో మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించలేక టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement