జొకోవిచ్ వర్సెస్ ఫెదరర్ | Novak Djokovic Thrashes Kei Nishikori to Set up Australian Open Semi-Final | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ వర్సెస్ ఫెదరర్

Published Tue, Jan 26 2016 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

జొకోవిచ్ వర్సెస్ ఫెదరర్

జొకోవిచ్ వర్సెస్ ఫెదరర్

మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో ఆసక్తికర పోరుకు ముందుగానే తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ , మూడో సీడ్ రోజర్ ఫెదరర్ లు సెమీ ఫైనల్లో పోరులో తలపడేందుకు సన్నద్ధమయ్యారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వీరు విజయం సాధించి సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నారు.  తొలుత జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ 7-6(7-4), 6-2, 6-4 తేడాతో బెర్డిచ్ పై గెలిచి సెమీస్ చేరగా, ఆ తరువాత జొకోవిచ్ 6-3, 6-2, 6-4 తేడాతో నిషికోరిపై విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నాడు.

ఇప్పటివరకూ వీరిద్దరి ముఖాముఖి రికార్డు 22-22తో సమంగా ఉంది. ఇప్పటికే 17 గ్రాండ్ స్లామ్ లు సాధించి టెన్నిస్ చరిత్రలో తనదైన ముద్రవేసిన ఫెదరర్ మరో టైటిల్ ను అందుకోవాలని భావిస్తుండగా, జొకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్ సాధించి తన టైటిల్స్ సంఖ్యను 11కు పెంచుకోవాలని యోచిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement