
డబుల్స్ క్వార్టర్స్‌లో పేస్ జోడి
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి లియాండర్ పేస్ ఒక్కడే మిగిలాడు.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి లియాండర్ పేస్ ఒక్కడే మిగిలాడు. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో పేస్-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి 6-3, 6-2తో యూకీ బాంబ్రీ (భారత్)-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో పేస్-హంతుచోవా (స్లొవేకియా) ద్వయం 7-5, 4-6, 10-7తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)-తొమ్లాజనోవిచ్ (క్రొయేషియా) జంటను... మహేశ్ భూపతి (భారత్)-ఎలీనా వెస్నినా (రష్యా) జోడి 6-7 (3/7), 6-4, 10-5తో అరంటా సాంటోజ్-మరెరో (స్పెయిన్) జంటపై నెగ్గి తదుపరి రౌండ్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జంట 4-6, 6-7 (1/7)తో హుయ్ (ఫిలిప్పీన్స్)-ఇంగ్లోట్ (బ్రిటన్) ద్వయం చేతిలో ఓడిపోయింది. బాలికల డబుల్స్ తొలి రౌండ్‌లో స్నేహదేవి రెడ్డి-ధ్రుతి (భారత్) జంట 6-2, 6-7 (4/7), 10-5తో నొజూమి-యుకీనా (జపాన్) జోడిపై గెలిచింది.