తుది పోరులో 'సిస్టర్స్' | Serena, Venus set up dream Australian final | Sakshi
Sakshi News home page

తుది పోరులో 'సిస్టర్స్'

Published Thu, Jan 26 2017 2:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

తుది పోరులో 'సిస్టర్స్'

తుది పోరులో 'సిస్టర్స్'

సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ తుది పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు విలియమ్స్ సిస్టర్స్ సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫెనల్లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించారు. నల్ల కలువ సెరెనా విలియమ్స్ 6-2, 6-1 తేడాతో లూసిచ్ పై గెలుపొంది ఫైనల్ కు చేరగా.. వీనస్ విలియమ్స్ 6-7(3/7), 6-2, 6-3 తేడాతో మరో అమెరికా క్రీడాకారిణి కోకో వాండెవేపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది.

 

కేవలం 50 నిమిషాల్లో సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి లూసిచ్ ను సునాయాసంగా మట్టికరిపించగా, మరో సెమీ ఫెనల్లో వీనస్ విలియమ్స్ పోరాడి గెలిచింది. తొలి సెట్ ను టై బ్రేక్లో వీనస్ కోల్పోయినా, ఆ తరువాత రెండు సెట్లను సొంతం చేసుకుని ఫైనల్కు చేరింది.



రికార్డు టైటిల్స్ పై సెరెనా గురి


ఆస్ట్ర్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో సెరెనా ఫైనల్ కు చేరడంతో ఆమె ఒక అరుదైన రికార్డుకు చేరువైంది. శనివారం జరిగే పోరులో సెరెనా గెలిస్తే ఓపెన్ శకంలో జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ సాధించిన అత్యధిక టైటిల్స్ రికార్డును అధిగమిస్తుంది. ప్రస్తుతం స్టెఫీ గ్రాఫ్-సెరెనాలు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి సమంగా ఉన్నారు. దాంతో ఇప్పుడు అందరి కళ్లు సెరెనాపైనే ఉన్నాయి. ఈ రికార్డును సెరెనా అధిగమిస్తుందా?లేదా అనేది ఎల్లుండి తేలిపోనుంది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్లో సెమీ ఫైనల్లోనే నిష్క్రమించి ఆ రికార్డును మిస్సయ్యింది.  ఇప్పుడు ఆ రికార్డును సవరించాలనే సెరెనా పట్టుదలగా ఉంది. మరొకవైపు  ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ సాధించాలని సెరెనా భావిస్తుండగా,   తొలిసారి ఆ టైటిల్ ను అందుకోవాలని వీనస్ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement