సెమీస్లో వావ్రింకా | Stan Wawrinka wins testy clash with Jo Wilfried Tsonga to reach semi-finals | Sakshi
Sakshi News home page

సెమీస్లో వావ్రింకా

Published Tue, Jan 24 2017 1:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

సెమీస్లో వావ్రింకా

సెమీస్లో వావ్రింకా

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మాజీ చాంపియన్ స్టాన్ వావ్రింకా సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ ఫోరులో వావ్రింకా 7-6(2), 6-4, 6-3 తేడాతో సోంగాపై విజయం సాధించి సెమీస్కు చేరాడు. రెండు గంటల 15 నిమిషాల పాటు జరిగిన పోరులో వావ్రింకా వరుస సెట్లను కైవసం చేసుకుని మరోసారి టైటిల్ ను కైవసం చేసుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచాడు. 2014లో ఆస్ట్రేలియా ఓపెన్ లో వావ్రింకా చాంపియన్గా అవతరించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్లో  ఆది నుంచి ఇరు వురి మధ్య హోరాహెరీ పోరుకు తెరలేచింది. ప్రధానంగా టై బ్రేక్కు దారి తీసిన తొలి సెట్లో ఇద్దరు క్రీడాకారులు రసవత్తర పోరును తలపించారు. ఆ క్రమంలోనే ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే ఇక్కడ సోంగాను మైండ్ గేమ్తో పక్కదోవ పట్టించిన వావ్రింకా..  తొలి సెట్ను సొంతం చేసుకుని పైచేయి సాధించాడు. అనంతరం జరిగిన రెండు సెట్లలో వావ్రింకా పెద్దగా కష్టపడకుండానే గెలిచి సెమీస్ లోకి ప్రవేశించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement