
PC: Australian Open Twitter
డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు ‘మిక్స్‌డ్’ టైటిల్
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్–మ్లాడెనోవిచ్ ద్వయం 6–3, 6–4తో జేసన్ కుబ్లెర్–జైమీ ఫోర్లిస్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మ్లాడెనోవిచ్‌కిది నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2014లో డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి మిక్స్‌డ్ టైటిల్ నెగ్గిన ఆమె తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి 2018, 2020లలో మహిళల డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది.
చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా!
Title town for 🇫🇷 @kikimladenovic & @dodigtennis 🇭🇷
— #AusOpen (@AustralianOpen) January 28, 2022
They defeat Fourlis/Kubler 6-3 6-4 to win the mixed doubles crown 🏆 #AusOpen • #AO2022
🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/SyeWnzdKjO