Ivan Dodig
-
Australian Open: మిక్స్డ్ డబుల్స్ విజేత.. డోడిగ్- క్రిస్టినా.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్–మ్లాడెనోవిచ్ ద్వయం 6–3, 6–4తో జేసన్ కుబ్లెర్–జైమీ ఫోర్లిస్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మ్లాడెనోవిచ్కిది నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2014లో డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి మిక్స్డ్ టైటిల్ నెగ్గిన ఆమె తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి 2018, 2020లలో మహిళల డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా! Title town for 🇫🇷 @kikimladenovic & @dodigtennis 🇭🇷 They defeat Fourlis/Kubler 6-3 6-4 to win the mixed doubles crown 🏆 #AusOpen • #AO2022 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/SyeWnzdKjO — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
రన్నరప్ సానియా–డోడిగ్ జంట
మెల్బోర్న్: తన డబుల్స్ కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి సానియా రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్ సానియా–డోడిగ్ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్ జంట అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)–యువాన్ సెబాస్టియన్ కాబల్ (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 16 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలిచిన స్పియర్స్–కాబల్ జంటకు 1,50,500 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 77 లక్షల 43 వేలు), రన్నరప్ సానియా జోడీకి 75,500 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 38 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సానియా–డోడిగ్ జంట ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రన్నరప్‌గా నిలువడం ఇది రెండోసారి. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పేస్ (భారత్)–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ చేతిలో సానియా–డోడిగ్ ఓటమి పాలయ్యారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సానియా మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. 2008లో మహేశ్ భూపతితో, 2014లో హŸరియా టెకావ్ (రొమేనియా)తో బరిలోకి దిగిన సానియా రన్నరప్‌గా నిలిచింది. -
గ్రాండ్ స్లామ్‌కు అడుగు దూరంలో
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా ద్వయం 6-4, 2-6, (10-5) తేడాతో ఆస్ట్రేలియా జంట సమంతా స్టోసుర్-సామ్ గ్రాత్ల జోడిపై గెలిచి తుది రౌండ్‌కు చేరింది. గంటా 18 నిమిషాలు పాటు జరిగిన పోరులో సానియా జోడి చెమటోడ్చి ఫైనల్ కు అర్హత సాధించింది. తొలి సెట్‌ను కష్టపడి గెలవగా, రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. టై బ్రేక్ కు దారి తీసిన మూడో సెట్లో సానియా జోడి తన ఫామ్‌ను అందుకుంటూ స్టోసుర్ జంటను ఓడించింది. ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో లియాండర్ పేస్-మార్టినా హింగిస్ జంటను స్టోసుర్-గ్రాత్ల జోడి ఓడించి సెమీస్ కు చేరగా, రోహన్ బోపన్న-గాబ్రియాలా డబ్రోస్కి ద్వయంపై సానియా-డో్డిగ్ జో్డి విజయం సాధించి సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా మహిళల డబుల్స్ టైటిల్ ను మార్టినా హింగిస్ తో కలిసి సానియా సాధించగా, 2009లో ఈ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను మహేశ్ భూపతితో కలిసి సానియా తొలిసారి సొంతం చేసుకుంది. -
సానియా జంట శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సానియా-డోడిగ్ జంట 6-4, 6-4తో టేలర్ టౌన్సెండ్-డొనాల్డ్ యంగ్ (అమెరికా) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7-5, 6-4తో జేమీ లోబ్-నోవా రూబిన్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) ద్వయం 2-6, 6-7 (5/7)తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓటమి పాలైంది. మెరుున్ ‘డ్రా’కు ప్రాంజల బాలికల సింగిల్స్ విభాగంలో తెలుగు అమ్మారుు యడ్లపల్లి ప్రాంజల మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిం చింది. శనివారం జరి గిన క్వాలిఫరుుంగ్ రెండో రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ ప్రాంజల 6-4, 6-4తో కరియన్ పియర్ లూరుుస్ (అమెరికా)పై గెలిచింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
సానియా జోడి ముందుకు..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా(భారత్)- ఇవాన్ డోడిగ్(క్రోయేషియా) జోడి ముందంజ వేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో సానియా జోడి 6-4, 6-4 తేడాతో టేలర్ టౌన్ సెండ్‌పై గెలిచింది. అరవై రెండు నిమిషాల పాటు జరిగిన పోరులో రెండు వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జంట రెండో రౌండ్ లో కి ప్రవేశించింది. ఈ జోడీ 2014 లో జరిగిన యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్, రోహన్ బోపన్న జంటలు నిష్ర్కమించాయి. లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట 6-2, 5-7, 4-6 తేడాతో స్టెఫానీ రాబర్ట్(ఫ్రెంచ్)- డుడీ సెలా(ఇజ్రాయిల్) జంట చేతిలో పరాజయం చెందగా, మరో మ్యాచ్ లో బోపన్న- ఫెడిరిక్ నీల్సన్(డెన్మార్క్) ద్వయం 2-6, 6-7(5/7) తేడాతో బ్రయాన్ బేకర్(అమెరికా)- మార్కస్ డేనియల్(న్యూజిలాండ్) చేతిలో ఓటమి చెందింది. -
మిక్స్డ్ డబుల్స్ లో సానియా జోడి ఓటమి
మెల్బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో మరో టైటిల్ పై సానియా మీర్జా పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీ ఫైనల్లో సానియా- ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జంట 5-7, 6-7(4/7) తేడాతో ఐదోసీడ్ ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రూనో సోరెస్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓటమి పాలయ్యారు. తొలి సెట్ ఆదిలో వెనుకబడిన సానియా జంట ఆ తరువాత పోరాడినా తేరుకోలేపోయింది. దీంతో తొలి సెట్ ను చేజార్చుకున్న సానియా-ఇవాన్ డోడిగ్లు రెండో సెట్ లో మాత్రం తీవ్రంగా పోరాడారు. రెండో సెట్ లో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్ ను రెండు సార్లు సానియా జోడి బ్రేక్ చేయగా, వెస్ని జోడి కూడా రెండు సార్లు సానియా ద్వయం సర్వీస్ లను అడ్డుకుంది. దీంతో రెండో సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. హోరాహోరీగా జరిగిన టై బ్రేక్ లో సానియా జంట 4 పాయింట్లను మాత్రమే సాధించి పరాజయం చెందింది. -
హింగిస్‌పై సానియాదే పైచేయి!
-
హింగిస్‌పై సానియాదే పైచేయి!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డోడిగ్(క్రొయేషియా) జోడి సెమీ ఫైనల్ కు చేరింది. గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 7-6(1), 6-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) పై గెలిచి సెమీస్ లోకి ప్రవేశించారు. ఒక గంటా 13 నిమిషాల పాటు జరిగిన పోరులో సానియా-డోడిగ్ ద్వయం పదునైన ఏస్ లతో ఆకట్టుకుంది. తొలి సెట్ టై బ్రేక్ కు దారి తీసినా సానియా-డోడిగ్ లు ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా హింగిస్-పేస్ పై పైచేయి సాధించి ఆ గేమ్ ను కైవసం చేసుకున్నారు. ఆ తరువాత కూడా అదే ఊపును కొనసాగించడంతో సానియా-డోడిగ్ జోడి సెమీస్ కు చేరింది. తమ తదుపరి పోరులో ఎలెనా వెస్నినా(రష్యా)- బ్రోనో సోర్స్(బ్రెజిల్) జంటతో సానియా-డోడిగ్ జోడి తలపడనుంది. 2009 లో మహేష్ భూపతి కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను సానియా చివరిసారి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహిళల డబుల్స్ విభాగంలో హింగిస్ తో కలిసి ఫైనల్ కు చేరిన సానియా మరో టైటిల్ కు ఒక అడుగు దూరంలో నిలిచింది.