సానియా జంట శుభారంభం | Sania Mirza advances; Leander Paes, Rohan Bopanna bow out | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Published Sun, Sep 4 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

సానియా జంట శుభారంభం

సానియా జంట శుభారంభం

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) ద్వయం శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో సానియా-డోడిగ్ జంట 6-4, 6-4తో టేలర్ టౌన్‌సెండ్-డొనాల్డ్ యంగ్ (అమెరికా) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంట 7-5, 6-4తో జేమీ లోబ్-నోవా రూబిన్ (అమెరికా) ద్వయంపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న-ఫ్రెడెరిక్ నీల్సన్ (డెన్మార్క్) ద్వయం 2-6, 6-7 (5/7)తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్) జంట చేతిలో ఓటమి పాలైంది.

మెరుున్ ‘డ్రా’కు ప్రాంజల
బాలికల సింగిల్స్ విభాగంలో తెలుగు అమ్మారుు యడ్లపల్లి ప్రాంజల మెరుున్ ‘డ్రా’కు అర్హత సాధిం చింది. శనివారం జరి గిన క్వాలిఫరుుంగ్ రెండో రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ ప్రాంజల 6-4, 6-4తో కరియన్ పియర్ లూరుుస్ (అమెరికా)పై గెలిచింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల రెండు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.  తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement