రన్నరప్‌ సానియా–డోడిగ్‌ జంట | Sania Mirza-Ivan Dodig face defeat in Australian Open | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సానియా–డోడిగ్‌ జంట

Published Mon, Jan 30 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

రన్నరప్‌ సానియా–డోడిగ్‌ జంట

రన్నరప్‌ సానియా–డోడిగ్‌ జంట

మెల్‌బోర్న్‌: తన డబుల్స్‌ కెరీర్‌లో ఏడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తన భాగస్వామి ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా)తో కలిసి సానియా రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో రెండో సీడ్‌ సానియా–డోడిగ్‌ ద్వయం 2–6, 4–6తో అన్‌సీడెడ్‌ జంట అబిగెయిల్‌ స్పియర్స్‌ (అమెరికా)–యువాన్‌ సెబాస్టియన్‌ కాబల్‌ (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 16 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. విజేతగా నిలిచిన స్పియర్స్‌–కాబల్‌ జంటకు 1,50,500 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 77 లక్షల 43 వేలు), రన్నరప్‌ సానియా జోడీకి 75,500 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 38 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

సానియా–డోడిగ్‌ జంట ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలువడం ఇది రెండోసారి. గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో పేస్‌ (భారత్‌)–మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జోడీ చేతిలో సానియా–డోడిగ్‌ ఓటమి పాలయ్యారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సానియా మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. 2008లో మహేశ్‌ భూపతితో, 2014లో హŸరియా టెకావ్‌ (రొమేనియా)తో బరిలోకి దిగిన సానియా రన్నరప్‌గా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement