సానియా జోడి ముందుకు.. | Paes, Bopanna beaten, Sania win in US Open | Sakshi
Sakshi News home page

సానియా జోడి ముందుకు..

Published Sat, Sep 3 2016 11:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

సానియా జోడి ముందుకు..

సానియా జోడి ముందుకు..

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్లో సానియా మీర్జా(భారత్)- ఇవాన్ డోడిగ్(క్రోయేషియా) జోడి ముందంజ వేసింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్ పోరులో సానియా జోడి 6-4, 6-4 తేడాతో  టేలర్ టౌన్ సెండ్పై గెలిచింది. అరవై రెండు నిమిషాల పాటు జరిగిన పోరులో రెండు వరుస సెట్లను కైవసం చేసుకున్న సానియా జంట రెండో రౌండ్ లో కి ప్రవేశించింది. ఈ జోడీ 2014 లో జరిగిన యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

 

మరోవైపు పురుషుల డబుల్స్లో  లియాండర్ పేస్, రోహన్ బోపన్న జంటలు నిష్ర్కమించాయి. లియాండర్ పేస్-ఆండ్రీ బెగ్ మాన్(జర్మనీ) జంట 6-2, 5-7, 4-6 తేడాతో స్టెఫానీ రాబర్ట్(ఫ్రెంచ్)- డుడీ సెలా(ఇజ్రాయిల్) జంట చేతిలో పరాజయం చెందగా, మరో మ్యాచ్ లో బోపన్న- ఫెడిరిక్ నీల్సన్(డెన్మార్క్) ద్వయం 2-6, 6-7(5/7) తేడాతో బ్రయాన్ బేకర్(అమెరికా)- మార్కస్ డేనియల్(న్యూజిలాండ్) చేతిలో ఓటమి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement