Kristina Mladenovic
-
Australian Open: మిక్స్డ్ డబుల్స్ విజేత.. డోడిగ్- క్రిస్టినా.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట విజేతగా నిలిచింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో డోడిగ్–మ్లాడెనోవిచ్ ద్వయం 6–3, 6–4తో జేసన్ కుబ్లెర్–జైమీ ఫోర్లిస్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. డోడిగ్–మ్లాడెనోవిచ్ జంటకు 1,90,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 99 లక్షల 65 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మ్లాడెనోవిచ్కిది నాలుగో డబుల్స్ టైటిల్ కావడం విశేషం. 2014లో డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి మిక్స్డ్ టైటిల్ నెగ్గిన ఆమె తిమియా బాబోస్ (హంగేరి)తో కలిసి 2018, 2020లలో మహిళల డబుల్స్ టైటిల్స్‌ను సాధించింది. చదవండి: 29 ఫోర్లు, 7 సిక్సులు.. తొలి వికెట్‌కు 155 పరుగులు.. అయినా! Title town for 🇫🇷 @kikimladenovic & @dodigtennis 🇭🇷 They defeat Fourlis/Kubler 6-3 6-4 to win the mixed doubles crown 🏆 #AusOpen • #AO2022 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/SyeWnzdKjO — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
టాప్ సీడ్ ఆట ముగిసింది
కరోనా భయంలో పలువురు స్టార్ క్రీడాకారిణులు దూరమైన నేపథ్యంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కరోలినా ప్లిస్కోవాకు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఈ మాజీ నంబర్‌వన్‌కు ఫ్రాన్స్ అమ్మాయి గార్షియా షాక్ ఇచ్చింది. పురుషుల విభాగంలో ఎలాంటి సంచలనాలు లేకుండా టాప్ ఆటగాళ్లంతా ముందంజ వేశారు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. చెక్ రిపబ్లిక్ స్టార్, టాప్‌సీడ్ ప్లిస్కోవా రెండో రౌండ్లోనే కంగుతింది. ఫ్రాన్స్ అమ్మాయి కరోలిన్ గార్షియా... ప్రపంచ మూడో ర్యాంకర్‌కు చెక్‌పెట్టింది. మిగతా రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జపాన్ స్టార్ నాలుగో సీడ్ నవోమి ఒసాకా అలవోక విజయం సాధించగా... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్, నాలుగో సీడ్ సిట్సిపాల్ (గ్రీస్), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. గార్షియా దూకుడు... కరోలిన్ గార్షియా (ఫ్రాన్స్) ర్యాంకే కాదు... గత ప్రదర్శన కూడా ప్లిస్కోవా ముందు తీసికట్టే! 50వ ర్యాంకర్ అయిన ఆమె ఏకంగా ప్రపంచ మూడో ర్యాంకర్ ప్లిస్కోవాను వరుస సెట్లలో ఓడించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో గార్షియా 6–1, 7–6 (7/2)తో టాప్‌సీడ్ ప్లిస్కోవాను ఇంటిదారి పట్టించింది. గంటా 33 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ను ముగించి సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జపాన్ స్టార్, నాలుగో సీడ్ నవోమి ఒసాకా 6–1, 6–2తో ఇటలీకి చెందిన కెమిలా గియోర్గీపై అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 10 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పదో సీడ్ ముగురుజా (స్పెయిన్) పోరాటం కూడా ముగిసింది. స్వెతానా పిరోంకోవా (బల్గేరియా) 7–5, 6–3తో ఆమెను ఓడించింది. స్నేహితురాలి ఓటమి... స్కోరు 6–1, 5–1...మ్యాచ్ గెలిచే క్రమంలో సర్వీస్ అవకాశం...అయితే ఇలాంటి స్థితిలో కూడా క్రిస్టినా మ్లాడినోవిక్ (ఫ్రాన్స్) ఓటమిపాలైంది. గార్షియా స్నేహితురాలు, 2016లో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుపులో భాగస్వామి అయిన మ్లాడినోవిక్పై 1–6, 7–6 (7–2), 6–0తో వర్వారా గ్రాషెవా (రష్యా) విజయం సాధించింది. ఓటమి అంచుల్లోనే రెండో సెట్‌ను గెలుచుకున్న గ్రాషెవా చివరి సెట్లో క్రిస్టినాను చిత్తు చేసింది. జొకో జోరు ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో (2011, 2015, 2018) మూడు సార్లు విజేత అయిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ కాస్త శ్రమించినా తేలిగ్గానే ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్ రెండ్లో సెర్బియా స్టార్ 6–7 (5/7), 6–3, 6–4, 6–2తో ఎడ్మండ్ (బ్రిటన్)పై గెలుపొందాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ జ్వెరెవ్ 7–5, 6–7 (8/10), 6–3, 6–1తో అమెరికాకు చెందిన బ్రాండన్ నకషిమాపై నెగ్గాడు. నాలుగో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 7–6 (7/2), 6–3, 6–4తో క్రెసీ (అమెరికా)పై గెలుపొందాడు. డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 7–6 (8/6), 4–6, 6–1, 6–4తో లాయిడ్ హరిస్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. -
మ్లాడెనోవిచ్ మెరుపులు
ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సీడెడ్ క్రీడాకారిణులకు అంతగా పేరులేని ప్రత్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. యువతారల ధాటికి టాప్-20 సీడింగ్స్ నుంచి కేవలం నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. అనామక క్రీడాకారిణులను తక్కువ అంచనా వేయకూడదని నిరూపిస్తూ... ఫ్రాన్స్ అమ్మాయి క్రిస్టినా మ్లాడెనోవిచ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ ఎకతెరీనా మకరోవాను ఇంటిదారి పట్టించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. - 13వ సీడ్ మకరోవాపై సంచలన విజయం - తొలిసారి ‘గ్రాండ్‌స్లామ్’ క్వార్టర్స్‌లోకి వీనస్‌తో సెరెనా అమీతుమీ - యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్: సమకాలీన మహిళల టెన్నిస్‌లో సీడింగ్ లేకున్నా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసే పరిస్థితి కనిపించడంలేదు. యూఎస్ ఓపెన్‌లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఈసారి అన్‌సీడెడ్ క్రీడాకారిణులు అదరగొట్టే ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా 22 ఏళ్ల క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) అద్భుత పోరాటంతో ఆకట్టుకొని 13వ సీడ్ మకరోవా (రష్యా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మ్లాడెనోవిచ్ 7-6 (7/2), 4-6, 6-1తో మకరోవాపై గెలిచింది. తొలి రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించిన మ్లాడెనోవిచ్ అదే జోరును కొనసాగిస్తూ తన కెరీర్లో 20వ ప్రయత్నంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. రెండు గంటల 12 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మ్లాడెనోవిచ్ నిర్ణాయక మూడో సెట్లో చెలరేగి ఆడింది. మకరోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో 20వ సీడ్ అజరెంకా (బెలారస్) 6-3, 6-4తో లెప్చెంకో (అమెరికా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ వేటలో టాప్ సీడ్ సెరెనా (అమెరికా) దూసుకుపోతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా 6-3, 6-3తో 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో తన సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా)తో సెరెనా తలపడుతుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో వీనస్ 6-2, 6-1తో కొంటావీట్ (ఎస్తోనియా)పై గెలిచింది. జొకోవిచ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు 18వ సీడ్ లోపెజ్ (స్పెయిన్), 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జొకోవిచ్ 6-3, 4-6, 6-4, 6-3తో అగుట్ (స్పెయిన్)పై, లోపెజ్ 6-3, 7-6 (7/5), 6-1తో ఫాగ్నిని (ఇటలీ)పై, సోంగా 6-4, 6-3, 6-4తో పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. క్వార్టర్స్‌లో సానియా ద్వయం మహిళల డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 6-3, 6-0తో మిచెల్లా క్రాయిసెక్ (నెదర్లాండ్స్)-స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం 6-7 (4/7), 6-4, 6-3తో నెస్టర్ (కెనడా)-వాసెలిన్ (ఫ్రాన్స్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. -
సానియా మీర్జా ఆశలపై నీళ్లు
మెల్బోర్న్: మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాలన్న భారత స్టార్ సానియా మీర్జా కల నెరవేరలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ రెండో టైటిల్ నెగ్గాలన్న ఆమె కోరిక తీరలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సానియా మీర్జా-హొరియా టెకావ్ (రుమేనియా) జోడి పరాజయం పాలయింది. క్రిస్టియానా మ్లాడినోవిక్(ఫ్రెంచ్)-డానియన్ నెస్టర్(కెనడా) జోడి చేతిలో 3-6 2-6తో ఓడిపోయింది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-టెకావ్ జంట కనీస పోరాట పటిమ కూడా కనబరచలేకపోయింది. ప్రత్యర్థుల ముందు తేలిగ్గా తలవంచింది.