సానియా జోడి ఓటమి | Sania loses in women's doubles | Sakshi
Sakshi News home page

సానియా జోడి ఓటమి

Published Sun, Jan 22 2017 4:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

సానియా జోడి ఓటమి

సానియా జోడి ఓటమి

స్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు చుక్కెదురైంది.

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు చుక్కెదురైంది. మూడో రౌండ్ లో సానియా-బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్) జోడి ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన పోరులో సానియా ద్వయం 6-3, 2-6, 2-6 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణులు హోజుమీ-కాటో(జపాన్) చేతిలో పరాజయం చెందారు. గంటా 53 నిమిషాలు పాటు జరిగిన పోరులో సానియా జోడి ఓటమి పాలైంది. దాంతో మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించాలనుకున్న సానియా ఆశలకు గండిపడింది.

 

మరోపోరులో లియాండర్ పేస్-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)లో విజయం సాధించి శుభారంభం చేశారు. తొలి రౌండ్ లో ఈ జోడి 6-4, 6-3 తేడాతో డెస్టానీ అవీవా-మార్క్ పోల్మాన్స్పై విజయం సాధించారు. 51 నిమిషాలు  పాటు జరిగిన పోరులో పేస్-హింగిస్ జోడి వరుస సెట్లను గెలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement