![Sania Mirza To Retire From Tennis At The End Of 2022 Season - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/19/Untitled-3.jpg.webp?itok=QwgT6zME)
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్(2022) చివర్లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్..తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది.
స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, 6-7(5)తేడాతో ఓటమిపాలైంది. గంటా 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ గట్టిగానే పోటీనిచ్చినప్పటికీ ఓటమి తప్పలేదు. సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. కాగా, ప్రస్తుతం డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకుంది.
చదవండి: Emma Raducanu: రాడుకాను బోణీ.. లేలాకు భారీ షాక్
Comments
Please login to add a commentAdd a comment