
Novak Djokovic In Australian Open Draw: సెర్బియన్ స్టార్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆడే విషయంలో అనిశ్చితి ఇంకా తొలగలేదు. కానీ ‘డ్రా’లో మాత్రం అతని పేరు ఖరారైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూసిన టెన్నిస్ టోర్నీ నిర్వాహకులు కాస్త ఆలస్యంగా ‘డ్రా’ను విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా ఉన్న ఈ సెర్బియా స్టార్ తొలి రౌండ్లో సహచరుడు మియోమిర్ కెమనొవిచ్‌తో తలపడనున్నాడు.
వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా... ప్రత్యేక మినహాయింపుతో ఆస్ట్రేలియాకు వచ్చిన జొకో వీసాను రద్దు చేశారు. అయితే అతను న్యాయపోరాటం చేసి ఊరట చెందాడు. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండోసారి వీసాను రద్దు చేసే అధికారం విదేశీ వ్యవహారాల మంత్రికి ఉంది. గురువారం తుది నిర్ణయం వెలువరిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ప్రభు త్వం తమ నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. తను మాత్రం ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తున్నాడు.
చదవండి: Virat Kohli: ఓడిపోతున్నామనే బాధ.. కోహ్లి అసహనం
Comments
Please login to add a commentAdd a comment