
ఆస్ట్రేలియా ఓపెన్ లో వీనస్ విలియమ్స్ కు చుక్కెదురు
మెల్బోర్న్: మాజీ ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ కు ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ లోనే చుక్కెదురైంది. ఏడు గ్రాండ్ శ్లామ్ లు గెలిచిన వీనస్ విలియమ్స్ 6-2, 4-6, 4-6 తేడాతో ప్రపంచ ఇరవై రెండో సీడెడ్ క్రీడాకారిణి ఎక్తరినా మాకారోవా చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్ ను గెలుచుకున్న అనంతరం వీనస్ వరుస తప్పిదాలు చేసి ఓటమి పాలైంది.
రెండో సెట్ లో వీనస్ కు సర్వీస్ ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా దాన్ని నిలుపుకోకపోవడంతో ఆ సెట్ ను చేజార్చుకుంది. రెండో సెట్ తొమ్మిదో గేమ్ లో మూడు సార్లు డబుల్ ఫాల్ట్స్ చేసిన వీనస్ ఆ సెట్ ను కోల్పోయింది. అనంతరం మూడు సెట్ తొలిభాగంలో మంచి ఊపు మీద కనిపించిన వీనస్ అనవసర తప్పిదాలు కారణంగా ఆ సెట్ ను కోల్పోయి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది.