ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది.
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పోరు ముగిసింది. రెండో రౌండ్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో ప్రపంచ నంబర్ నాల్గో నంబర్ ఆటగాడు శ్రీకాంత్ 21-18, 17-21, 13-21 తేడాతో చైనీస్ ఆటగాడు తియాన్ హువీ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న శ్రీకాంత్ ఆ తరువాత బొక్క బోర్లాపడ్డాడు. వరుస గేమ్ లను చేజార్చుకుని పరాజయం చెందాడు.కేవలం ఒక గంటా ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీకాంత్ ఆశించినంతంగా ఆకట్టుకోలేదు.
ఇదిలా ఉండగా మహిళల విభాగంలో జ్వాలా-అశ్వినల జోడి కూడా నిరాశ పరిచారు. ఇండోనేషియా జోడీ నిత్యా క్రిషిందా మహేశ్వరి -రేసియా చేతిలో 21-14, 21-10 తేడాతో జ్వాల జోడి ఓటమి పాలైంది.