ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో సానియా జోడీ పోరాడి ఓడిపోయింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన సెమీస్లో సానియా, బ్రూనో సోర్స్ 6-3, 2-6, 8-10 స్కోరుతో మ్లెడెనోవిచ్, డానియల్ నెస్టర్ జంట చేతిలో ఓడిపోయారు.