బీజింగ్: గతవారం పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నీ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చైనా ఓపెన్‌లోనూ శుభారంభం చేసింది. తన కొత్త భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా వరుసగా రెండో టోర్నీలో ఆడుతోంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ 6-3, 6-3తో కిమికో డాటె క్రుమ్ (జపాన్)-చానెల్లి షీపర్స్ (జర్మనీ)లపై గెలిచారు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది.
మెయిన్ ‘డ్రా’కు సోమ్‌దేవ్
ఇదే టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో సోమ్‌దేవ్ 3-6, 7-6 (7/5), 6-3తో పాలో లోరెంజి (ఇటలీ)పై గెలిచాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్‌లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్)తో సోమ్‌దేవ్ ఆడతాడు. ఇదే టోర్నీ డబుల్స్ తొలి రౌండ్‌లో మహేశ్ భూపతి (భారత్)-రాబర్ట్ లిండ్‌స్టెడ్ (స్వీడన్) జోడి జొకోవిచ్ (సెర్బియా)-వావ్రింకా (స్విట్జర్లాండ్) జంటతో ఆడుతుంది.
సానియా జోడి శుభారం
Published Tue, Oct 1 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement