Somdev
-
సోమ్‌దేవ్ వీడ్కోలు
అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్‌కు ముగింపు న్యూఢిల్లీ: భారత మాజీ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 31 ఏళ్ల సోమ్‌దేవ్‌ను గత కొన్నేళ్లుగా గాయాలు పదేపదే ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో కొత్త సంవత్సరం తొలిరోజైన ఆదివారం ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు. ‘రిటైర్మెంట్తో 2017ను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నా. నా కెరీర్ ఆసాంతం సహకరించిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఊహ తెలిసినప్పటి నుంచి టెన్నిసే ప్రపంచంగా పెరిగిన తనలో ఇపుడా ఆశ లేదని... ఆడాలన్న తపన ఏమాత్రం లేదని, అందుకే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని రాకెట్‌ను వదిలేస్తున్నట్లు చెప్పాడు. కష్టకాలంలో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఎప్పుడు అండగా నిలువలేదని తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. సరైన వ్యవస్థ లేదు: ఆటగాళ్లు ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు భారత్‌లో సరైన వ్యవస్థేలేదని ‘ఐటా’ను ఉద్దేశించి సోమ్‌దేవ్ అన్నాడు. భారత డేవిస్ కప్ జట్టు కోచ్ పదవి కోసం ప్రయత్నించలేదని చెప్పాడు. సింగిల్స్‌లో అతని కెరీర్ బెస్ట్ ర్యాంకు 62. 2009లో చెన్నై ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సోమ్‌దేవ్ ఏటీపీ సర్క్యూట్ సింగిల్స్‌లో 62 మ్యాచ్‌లు గెలువగా... 81 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. డబుల్స్ బెస్ట్ ర్యాంకు 139 కాగా...19 మ్యాచ్‌ల్లో గెలిచి 26 మ్యాచ్‌ల్లో ఓడాడు. ప్రస్తుతం సోమ్‌దేవ్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 909వ స్థానంలో ఉన్నాడు. 2012లో భుజం గాయం అతని కెరీర్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ అడపాదడపా ఆడటం మళ్లీ ఆటకు దూరమవడం పరిపాటిగా మారింది. -
కుర్రాళ్లపైనే భారం!
నేటి నుంచి కొరియాతో డేవిస్ కప్ పోరు డబుల్స్‌లో బోపన్న జతగా పేస్ చండీగఢ్: కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడటం... బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు అనుభవం లేకపోవడం, సమన్వయ లోపం వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్... డేవిస్ కప్ పోరుకు సిద్ధమైంది. ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో భారత్... కొరియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సమస్యలున్నా ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గాయాల కారణంగా యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్‌లు గైర్హాజరీతో.. 21 ఏళ్ల రామ్‌కుమార్‌కు డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. చెన్నైకి చెందిన ఇతనికి అనుభవం లేకపోయినా నైపుణ్యానికి మాత్రం కొదువలేదు. ఇక సాకేత్ మైనేని అనుభవం ఉన్నా... భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతను ఫిట్‌గా ఉండటం భారత్‌కు చాలా అత్యవసరం. ఓవరాల్‌గా సీనియర్లు లేకపోవడంతో ఇప్పుడు ఈ కుర్రాళ్లపై భారత్ నమ్మకం పెట్టుకుంది. అయితే ప్రత్యర్థి జట్టుకు అనుభవం లేకపోవడం, సొంతగడ్డపై మ్యాచ్‌లు జరుగుతుండటం ఈ ఇద్దరికి కలిసొచ్చే అంశం. రాజ్‌భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హరియాణా, పంజాబ్ గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ డేవిస్ కప్‌కు సంబంధించిన డ్రాను విడుదల చేశారు. దీని ప్రకారం కొరియా నుంచి భారత్‌కు పెద్దగా ఇబ్బందులేమీ కనిపించడం లేదు. 2008 తర్వాత భారత్‌లో గ్రాస్‌కోర్టుపై డేవిస్ మ్యాచ్‌లు జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో న్యూఢిల్లీలో జరిగిన పోరులో భారత్ 3-2తో జపాన్ను ఓడించింది. శుక్రవారం జరిగే తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ (217)... సియోంగ్ చెన్ హాంగ్ (427)తో; రెండో సింగిల్స్‌లో సాకేత్... యంగ్ యూ లిమ్తో తలపడతారు. జత కుదిరేనా..! సీనియర్ ఆటగాళ్లు లియాండర్ పేస్-రోహన్ బోపన్నలు మరోసారి డేవిస్ కప్‌లో జతగా బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ జోడీపైనే అందరి దృష్టి నెలకొంది. గతంలో పేస్-బోపన్న... చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైనా... సెర్బియాతో పోరులో మాత్రం అద్భుతంగా ఆడారు. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో ఆడాలని అందరూ కోరుకుంటున్నా... ఈ ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల రియో ఒలింపిక్స్ కోసం బోపన్న.. సాకేత్ పేరును సూచించగా ఏఐటీఏ జోక్యం చేసుకుని పేస్‌ను జోడీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కొరియాపై భారత్ గెలవాలంటే పేస్-బోపన్న డబుల్స్‌లో సత్తా చాటాలి. శనివారం జరిగే డబుల్స్‌లో పేస్-బోపన్న జంటతో... హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్లు తలపడతారు. బుధవారమే చండీగఢ్‌కు చేరుకున్న పేస్.. గంటన్నర పాటు ప్రాక్టీస్ చేశాడు. గతాన్ని మర్చిపోయి కలిసి ఆడతామని పేస్, బోపన్న చెబుతున్నా.. మైదానంలో ఏమేరకు సమన్వయం కుదురుతుందో చూడాలి. -
రామ్‌కుమార్ శుభారంభం
♦ సోమ్‌దేవ్‌కు చుక్కెదురు ♦ చెన్నై ఓపెన్ టోర్నీ చెన్నై: సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో భారత యువ టెన్నిస్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్లో రెండో గొప్ప విజయాన్ని సాధించాడు. చెన్నై ఓపెన్‌లో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 248వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6-2, 6-0తో ప్రపంచ 98వ ర్యాంకర్ డానియెల్ గిమెనో ట్రావెర్ (స్పెయిన్)ను బోల్తా కొట్టించాడు. టాప్-100లోని క్రీడాకారుడిని ఓడించడం రామ్‌కుమార్‌కిది రెండోసారి మాత్రమే. గతేడాది ఇదే టోర్నీలో అప్పడు 90వ ర్యాంక్‌లో ఉన్న సోమ్‌దేవ్‌ను రామ్‌కుమార్ ఓడించాడు. ఈ టోర్నీలో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన ఈ చెన్నై ఆటగాడు రెండో రౌండ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)తో తలపడతాడు. మరోవైపు క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. సోమ్‌దేవ్ 3-6, 6-3, 3-6తో రష్యాకు చెందిన 18 ఏళ్ల ఆండ్రీ రుబ్లెవ్ చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్స్‌లో పేస్ జంట పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్లో పేస్-గ్రానోలెర్స్ ద్వయం 6-2, 6-3తో తారో డానియల్ (జపాన్)-జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) జంట 3-6, 7-6 (7/2), 7-10తో టాప్ సీడ్ రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)-రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
రెండో రౌండ్లో సాకేత్
* సోమ్‌దేవ్, బాలాజీ కూడా * చెన్నై ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీ చెన్నై: భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, శ్రీరామ్ బాలాజీలు క్వాలిఫయింగ్ విభాగంలో శుభారంభం చేశారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సాకేత్ మైనేని భారత్‌కే చెందిన సనమ్ సింగ్‌పై 6-2, 6-4తో విజయం సాధించాడు. 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో సోమ్‌దేవ్ 6-2, 6-3తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)పై, శ్రీరామ్ బాలాజీ 6-2, 6-4తో హాన్స్ కాస్టిలో (చిలీ)పై నెగ్గారు. మరోవైపు శనివారం మెయిన్ ‘డ్రా’ను విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. భారత ప్లేయర్ రామ్‌కుమార్ తొలి రౌండ్లో డానియల్ గిమెనో (స్పెయిన్)తో ఆడతాడు. ప్రధాన టోర్నీ సోమవారం మొదలవుతుంది. -
సోమ్‌దేవ్ సంచలనం
ప్రపంచ 40వ ర్యాంకర్‌పై గెలుపు ♦ యూకీ బాంబ్రీ పరాజయం ♦ తొలి రోజు 1-1తో సమం ♦ భారత్, చెక్ రిపబ్లిక్ డేవిస్ కప్ పోరు ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఈ ఏడాది తనకంటే ఎంతో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల చేతిలో ఓడిపోయిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సొంతగడ్డపై మాత్రం అద్భుతమే చేశాడు. జాతీయ జట్టు కోసం ఆడే సమ యంలో... అదీ డేవిస్‌కప్ లాంటి ఈవెంట్లో ఆటగాళ్ల ర్యాంక్‌తో పనిలేదని సోమ్‌దేవ్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ జట్టు చెక్ రిపబ్లిక్‌తో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో సోమ్ దేవ్ అద్వితీయ ఆటతీరు కారణంగా తొలి రోజును భారత్ 1-1తో సమంగా ముగించింది. తొలి మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ ఓడిపోయి నప్పటికీ... రెండో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ విశేషంగా రాణించి ప్రపంచ 40వ ర్యాంకర్ జిరీ వెసిలీపై వరుస సెట్లలో గెలిచి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. న్యూఢిల్లీ : తనకెంతో కలిసొచ్చిన ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డీఎల్టీఏ) సెంటర్ కోర్టులో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఈ సీజన్లో అతి పెద్ద విజయాన్ని సాధించాడు. 2010 నుంచి ఈ మైదానంలో పరాజయమెరుగని అతను అదే ఆనవాయితీని కొనసాగించి తన ఖాతాలో మరో గెలుపును నమోదు చేసుకున్నాడు. ప్రపంచ నంబర్‌వన్ జట్టు, టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్, భారత్ మధ్య శుక్రవారం మొదలైన డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తొలి రోజు రెండు జట్లు ఒక్కో విజయాన్ని సాధించి 1-1తో సమంగా నిలిచాయి. తొలి సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 125వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ 2-6, 1-6, 5-7తో 85వ ర్యాంకర్ లుకాస్ రొసోల్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో 164వ ర్యాంకర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 7-6 (7/3), 6-4, 6-3తో 40వ ర్యాంకర్ జిరీ వెసిలీపై సంచలన విజయం సాధించి స్కోరును 1-1తో సమంగా చేశాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో రాడెక్ స్టెపానెక్-ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) జంటతో లియాండర్ పేస్-రోహన్ బోపన్న (భారత్) ద్వయం తలపడుతుంది. ఆదివారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. ►ఈ ఏడాది తాను ఆడిన 51 మ్యాచ్‌ల్లో 26 విజయాలు, 25 పరాజయాలు నమోదు చేసి అంత గొప్ప ఫామ్‌లో లేని సోమ్‌దేవ్ జట్టుకు అవసరమైన సమయంలో ఆపద్భాంధవుడి పాత్రను పోషించాడు. ఈ సీజన్లో తనకంటే ఎంతో తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల చేతుల్లో ఓడిపోయిన సోమ్‌దేవ్.. ఈ ఫలితాల ప్రభావాన్ని డేవిస్ కప్‌లో చూపలేదు. ► {పపంచ 40వ ర్యాంకర్ జిరీ వెసిలీతో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. కోర్టులో చురుకైన కదలికలు, పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన రిటర్న్ షాట్లతో అలరించిన సోమ్‌దేవ్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. ► 2 గంటల 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఫలితంగా ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సోమ్‌దేవ్ పైచేయి సాధించి తొలి సెట్‌ను 69 నిమిషాల్లో దక్కించుకున్నాడు. ► రెండో సెట్లోనూ ఇద్దరూ నాణ్యమైన ఆటతీరును కనబరిచారు. అయితే తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సోమ్‌దేవ్... జిరీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 55 నిమిషాల్లో రెండో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో సోమ్‌దేవ్ రెట్టించిన ఉత్సాహంతో ఆడాడు. జిరీ సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసి, ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని మూడో సెట్‌ను 38 నిమిషాల్లో ముగించిన సోమ్‌దేవ్ భారత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. ► మ్యాచ్ మొత్తంలో సోమ్‌దేవ్ 20 ఏస్‌లు సంధించి, కేవలం ఒకటే డబుల్ ఫాల్ట్ చేశాడు. 41 అనవసర తప్పిదాలు చేసినా, 65 విన్నర్స్‌తో ఫలితాన్ని ప్రభావితం చేశాడు. మరోవైపు ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన జిరీ వాసిలీ, ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 40 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ► అంతకుముందు తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. తొలి రెండు సెట్లను 55 నిమిషాల్లోనే కోల్పోయిన యూకీ, మూడో సెట్లో కాస్త పోరాటపటిమ కనబరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. రొసోల్ 11 ఏస్‌లు సంధించి, యూకీ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు యూకీ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి నిరాశ పరిచాడు. నా కెరీర్లో గొప్పగా సర్వీస్ చేసిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. నా ఆటతీరుపట్ల సంతృప్తితో ఉన్నాను. బరిలో దిగేముందు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాను. ప్రత్యర్థి ర్యాంక్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో నేను గెలుస్తానని ఎవరూ ఊహించలేదు. దాంతో ఫలితం గురించి ఆలోచించకుండా, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నాను. శనివారం జరిగే డబుల్స్‌లో భారత్‌కే విజయావకాశాలు ఉన్నాయి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో ఎవరికైనా గెలిచే చాన్స్ ఉంది. ఇప్పటికీ చెక్ రిపబ్లిక్‌ను తక్కువ అంచనా వేయలేం. -సోమ్‌దేవ్ -
సెమీస్‌లో సోమ్‌దేవ్, యుకీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్‌లో భారత యువ టెన్నిస్ ఆటగాళ్లు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, యుకీ భాంబ్రీ సెమీస్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సోమ్‌దేవ్ 4-6 6-1 6-3 స్కోరుతో సనమ్ సింగ్‌పై పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో యుకీ 7-6 (3) 6-3తో రడు ఆల్బట్పై విజయం సాధించాడు. -
యుకీ, సోమ్దేశ్ శుభారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాళ్లు యుకీ భాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో యుకీ 7-5 7-6(2)తో అలెగ్జాండర్ కుడ్రెవ్సెవ్ (రష్యా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 4-6, 2-0 స్కోరుతో ఉన్న దశలో ప్రత్యర్థి అంటోనియో వీక్ (క్రొయేషియా) గాయం కారణంగా వైదొలిగాడు. భారత ఆటగాళ్లు సనమ్ సింగ్, రామ్‌కుమార్ రామనాథన్ కూడా టోర్నీలో ముందంజ వేశారు. -
సోమ్‌దేవ్ ఓటమి
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 2-6, 7-5, 3-6తో డానియల్ మునోజ్ లా నవా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో ప్రపంచ 287వ ర్యాంకర్ మునోజ్‌ను ఓడిచించిన ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ ఈ టోర్నీలో మాత్రం నిరాశపరిచాడు. -
12వ ర్యాంక్‌లో బోపన్న
న్యూఢిల్లీ: ఏటీపీ దుబాయ్ 500 టైటిల్ నెగ్గిన డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. తాజాగా వెల్లడించిన డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. పేస్ పదో స్థానంలోనే ఉండగా భూపతి ఆరు స్థానాలు దిగజారి 47వ ర్యాంకులో ఉన్నాడు. సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ (78), యూకీ బాంబ్రీ (146) ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. సాకేత్ మైనేని 297వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
సోమ్‌దేవ్‌కు షాక్
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ డెల్‌పొట్రోపై సంచలన విజయం నమోదు చేసిన భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు రెండో రౌండ్లో అనూహ్య ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ 3-6, 5-7తో ప్రపంచ 137వ ర్యాంకర్ మాలిక్ జజిరి (ట్యూనిషియా) చేతిలో ఓడిపోయాడు. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోమ్‌దేవ్ నాలుగు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రెండో రౌండ్లో ఓడిన సోమ్‌దేవ్‌కు 24,475 డాలర్ల (రూ.15 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
యూకీ xసోమ్‌దేవ్
చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్ బెర్తు కోసం భారత ఆటగాళ్ల మధ్యే పోటీ జరగనుంది. టాప్‌సీడ్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, ఏడో సీడ్ యూకీ బాంబ్రీలు సెమీఫైనల్లో ముఖాముఖి తలపడనున్నారు. గురువారం తనతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సిన జోర్డీ మోంటానా (స్పెయిన్) కడుపునొప్పి కారణంగా పోటీ నుంచి వైదొలగడంతో సోమ్‌దేవ్‌కు వాకోవర్ లభించింది. కాగా, యూకీ 3-6, 6-2, 6-2తో లూయిస్ పౌలే (ఫ్రాన్స్)ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని ప్రస్థానం క్వార్టర్స్‌తో ముగిసింది. రష్యా ఆటగాడు అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ చేతిలో సాకేత్ 0-6, 2-6తో ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్‌లో సనమ్‌సింగ్ 5-7, 4-6తో రెండో సీడ్ డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓడాడు. మరోవైపు మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)తో కలిసి యూకీ బాంబ్రీ డబుల్స్‌లోనూ సెమీస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో యూకీ-వీనస్ జోడి 6-2, 6-3తో థామస్ ఫాబియానో-అగస్టిన్ వెలోటి జంటపై గెలుపొందింది. బాలాజీ-బ్లాజ్ రోలా ద్వయం సెమీఫైనల్‌కు చేరింది. -
సానియా జోడి శుభారం
బీజింగ్: గతవారం పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నీ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చైనా ఓపెన్‌లోనూ శుభారంభం చేసింది. తన కొత్త భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా వరుసగా రెండో టోర్నీలో ఆడుతోంది. సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-కారా బ్లాక్ 6-3, 6-3తో కిమికో డాటె క్రుమ్ (జపాన్)-చానెల్లి షీపర్స్ (జర్మనీ)లపై గెలిచారు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మెయిన్ ‘డ్రా’కు సోమ్‌దేవ్ ఇదే టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సోమ్‌దేవ్ 3-6, 7-6 (7/5), 6-3తో పాలో లోరెంజి (ఇటలీ)పై గెలిచాడు. మంగళవారం జరిగే తొలి రౌండ్లో ప్రపంచ 31వ ర్యాంకర్ ఫెర్నాండో వెర్దాస్కో (స్పెయిన్)తో సోమ్‌దేవ్ ఆడతాడు. ఇదే టోర్నీ డబుల్స్ తొలి రౌండ్లో మహేశ్ భూపతి (భారత్)-రాబర్ట్ లిండ్‌స్టెడ్ (స్వీడన్) జోడి జొకోవిచ్ (సెర్బియా)-వావ్రింకా (స్విట్జర్లాండ్) జంటతో ఆడుతుంది. -
సెమీస్‌లో పేస్ జోడి
న్యూఢిల్లీ: భారత సీనియర్ ఆటగాడు లియాండర్ పేస్-డానియెలి బ్రాసియెలి (ఇటలీ)... థాయ్‌లాండ్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో రెండోసీడ్ పేస్-డానియెలి జంట 6-7 (4), 7-6 (8), 10-8తో కొలంబియా జోడి యువాన్ సెబాస్టియన్ కాబల్-రొబెర్ట్ ఫర్హాపై విజయం సాధించింది. మరోవైపు కౌలాంలపూర్లో జరుగుతున్న మలేసియా ఓపెన్ డబుల్స్ క్వార్టర్స్‌లో స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్-రిక్ డి వోయెస్ (దక్షిణాఫ్రికా) 3-6, 6-4, 10-7తో జిమోన్జిక్ (సెర్బియా)-జూలియన్ బెన్నెటియూ (స్విట్జర్లాండ్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు. -
మెయిన్ ‘డ్రా’కు చేరువలో సోమ్‌దేవ్
న్యూయార్క్: మరో విజయం సాధిస్తే భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో సోమ్‌దేవ్ 7-6 (7/4), 2-6, 6-2తో రాబీ జినెప్రి (అమెరికా)పై విజయం సాధించాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన సోమ్‌దేవ్‌కు రెండో సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా ఫలితం లేకపోయింది. అయితే నిర్ణాయక మూడో సెట్లో సోమ్‌దేవ్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. జేమ్స్ వార్డ్ (బ్రిటన్)తో జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సోమ్‌దేవ్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందుతాడు. యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఈనెల 26న ప్రారంభమవుతుంది.