క్వార్టర్స్‌లో సానియా జోడీ | sania in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జోడీ

Published Wed, Jan 14 2015 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

క్వార్టర్స్‌లో సానియా జోడీ

క్వార్టర్స్‌లో సానియా జోడీ

సిడ్నీ: సిడ్నీ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-బెథానీ ద్వయం 6-3, 6-2తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)-అరంటా సంటోంజా (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)లతో సానియా జంట ఆడుతుంది.
 
 బోపన్న జంట ముందంజ
 ఇదే టోర్నమెంట్ పురుషుల విభాగంలో  రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న-నెస్టర్ ద్వయం 6-7 (11/13), 7-5, 10-6తో పాబ్లో క్యూవాస్ (అర్జెంటీనా)-డేవిడ్ మరెరో (స్పెయిన్) జంటపై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సిమోన్ బొలెలీ-ఫాగ్‌నిని (ఇటలీ) జోడీతో బోపన్న జంట తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement