sydney open
-
సిడ్నీ ఓపెన్ సెమీస్‌లో బోపన్న జంట
సిడ్నీ: భారత టెన్నిస్ డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న తన భాగస్వామి ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్)తో కలిసి సిడ్నీ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. సిడ్నీలో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నాలుగో సీడ్ ఫ్యాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–నికోలస్ మొన్రో (అమెరికా) జంటను కంగుతినిపించింది. -
సెమీస్‌లో సానియా జంట
సిడ్నీ: ఈ ఏడాది ఆడుతోన్న రెండో టోర్నమెంట్లోనూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగిస్తోంది. తన రెగ్యులర్ భాగస్వామి బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి సిడ్నీ ఓపెన్‌లో బరిలోకి దిగిన సానియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–బార్బరా ద్వయం 6–3, 6–4తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)–అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై విజయం సాధించింది. టాప్ సీడ్ హోదాలో ఆడుతున్న సానియా–బార్బరా తొలి రౌండ్లో 5–7, 6–1, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో హలవకోవా (చెక్ రిపబ్లిక్)–షుయె పెంగ్ (చైనా)పై కష్టపడి గెలిచారు. గురువారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ వానియా కింగ్ (అమెరికా)–యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటతో సానియా–బార్బరా ద్వయం తలపడుతుంది. గతవారం సానియా తన పార్ట్‌టైమ్ భాగస్వామి బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకున్న సంగతి విదితమే. టాప్ సీడ్ జోడీకి పేస్ జంట షాక్ మరోవైపు న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్‌లో లియాండర్ పేస్ (భారత్)–ఆండ్రీ సా (బ్రెజిల్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో పేస్–ఆండ్రీ సా జోడీ 7–6 (7/3), 6–3తో టాప్ సీడ్ ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–మాక్స్ మిర్నీ (బెలారస్) జంటపై సంచలన విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఈ ఇండో–బ్రెజిలియన్ జోడీ మార్కస్ డానియెల్ (న్యూజిలాండ్)–మార్సెలో డెలోలైనర్ (బ్రెజిల్)లతో ఆడుతుంది. బోపన్న ద్వయం ఓటమి సిడ్నీ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) జంటకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బోపన్న–క్యువాస్ 6–7 (5/7), 7–6 (7/4), 9–11తో ‘సూపర్ టైబ్రేక్’లో మాయెర్–పెట్ష్నెర్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయారు. -
సానియా జంట జైత్రయాత్ర
సిడ్నీ ఓపెన్‌లోనూ విజేత ఇండో-స్విస్ జోడీకిది వరుసగా ఏడో టైటిల్ సిడ్నీ: ప్రత్యర్థులు ఎవరైనా... వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... అన్నింటినీ అధిగమిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా సిడ్నీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ జంటకే టైటిల్ లభించింది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 1-6, 7-5, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీపై అద్భుత విజయం సాధించింది. వరుసగా 30వ మ్యాచ్‌లో గెలిచిన సానియా-హింగిస్ జంటకిది వరుసగా ఏడో టైటిల్ కాగా... ఓవరాల్‌గా 11వది. విజేతగా నిలిచిన వీరిద్దరికీ 40,200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 27 లక్షల 25 వేలు) తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతేడాది బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఈ టైటిల్‌ను నెగ్గిన సానియా ఈసారి హింగిస్‌తో కలిసి సాధించడం విశేషం. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఒకదశలో తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్లో 2-5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే గత ఆరు నెలలుగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న ఈ జంట ఇలాంటి క్లిష్టమైన దశలోనూ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఓపికతో ఆడింది. చక్కటి సమన్వయంతో రాణించి వరుసగా ఐదు గేమ్‌లు గెల్చుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. సూపర్ టైబ్రేక్‌లోనూ సానియా జంట ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. తాజా టైటిల్‌తో ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జాతో కలిసి మార్టినా హింగిస్ సంయుక్తంగా అగ్రస్థానంలోకి చేరుకుంటుంది. 2000 తర్వాత టాప్ ర్యాంక్ అందుకోవడం హింగిస్కిదే ప్రథమం. -
ఆక్లాండ్‌లో పేస్... సిడ్నీలో బోపన్న
కొత్త ఏడాది భారత టెన్నిస్ ఆటగాళ్లకు కలిసొస్తోంది. శుక్రవారం సానియా మీర్జా సిడ్నీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గగా... మరుసటి రోజే భారత ఆటగాళ్ల ఖాతాలో మరో రెండు డబుల్స్ టైటిల్స్ చేరడం విశేషం. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన హైనికెన్ ఓపెన్‌లో లియాండర్ పేస్ (భారత్) తన భాగస్వామి రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి చాంపియన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సిడ్నీ ఓపెన్‌లో రోహన్ బోపన్న (భారత్) తన భాగస్వామి డానియల్ నెస్టర్ (కెనడా)తో కలిసి విజేతగా అవతరించాడు. మెల్బోర్న్లో యువతార యూకీ బాంబ్రీ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన ‘డ్రా’కు అర్హత సాధించాడు.. డబుల్స్ టైటిల్స్ నెగ్గిన భారత ఆటగాళ్లు ఆక్లాండ్: తన 99వ భాగస్వామితో కలిసి భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ తొలి టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన హైనికెన్ ఓపెన్‌లో పేస్-క్లాసెన్ ద్వయం 7-6 (7/1), 6-4తో డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్) -ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటను ఓడించింది. కెరీర్లో 93వ డబుల్స్ ఫైనల్ ఆడిన 41 ఏళ్ల పేస్‌కిది 55వ టైటిల్ కావడం విశేషం. 1997 నుంచి ప్రతి ఏడాది పేస్ కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వస్తున్నాడు. విజేతగా నిలిచిన పేస్ జోడీకి 25,670 డాలర్ల (రూ. 15 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్ చేరుకునే క్రమంలో ఆడిన మూడు మ్యాచ్‌లను సూపర్ టైబ్రేక్‌లో నెగ్గిన పేస్ జంట టైటిల్ పోరును మాత్రం వరుస సెట్లలో ముగించింది. సిడ్నీ: తన కొత్త భాగస్వామి డానియల్ నెస్టర్‌తో రోహన్ బోపన్న తొలి టైటిల్‌ను గెల్చుకున్నాడు. శనివారం జరిగిన సిడ్నీ ఓపెన్ ఫైనల్లో బోపన్న-నెస్టర్ (కెనడా) ద్వయం 6-4, 7-6 (7/5)తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) జంటపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. గతవారం బ్రిస్బేన్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన ఈ జంట సిడ్నీలో మాత్రం విజేతగా నిలిచింది. టైటిల్ నెగ్గిన బోపన్న జోడీకి 24,280 డాలర్ల (రూ. 14 లక్షల 95 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 ఏళ్ల బోపన్నకు కెరీర్లో ఇది 11వ డబుల్స్ టైటిల్. 42 ఏళ్ల నెస్టర్కిది 86వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. గత 22 ఏళ్ల నుంచి నెస్టర్ ప్రతి ఏడాది కనీసం ఒక టైటిలైనా గెలుస్తున్నాడు. మైక్ బ్రయాన్ (105), బాబ్ బ్రయాన్ (103) తర్వాత ఏటీపీ సర్యూట్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డబుల్స్ ప్లేయర్‌గా నెస్టర్ నిలిచాడు. -
క్వార్టర్స్‌లో సానియా జోడీ
సిడ్నీ: సిడ్నీ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) ద్వయం శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-బెథానీ ద్వయం 6-3, 6-2తో ఎరాకోవిచ్ (న్యూజిలాండ్)-అరంటా సంటోంజా (స్పెయిన్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)లతో సానియా జంట ఆడుతుంది. బోపన్న జంట ముందంజ ఇదే టోర్నమెంట్ పురుషుల విభాగంలో రోహన్ బోపన్న (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-నెస్టర్ ద్వయం 6-7 (11/13), 7-5, 10-6తో పాబ్లో క్యూవాస్ (అర్జెంటీనా)-డేవిడ్ మరెరో (స్పెయిన్) జంటపై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సిమోన్ బొలెలీ-ఫాగ్నిని (ఇటలీ) జోడీతో బోపన్న జంట తలపడుతుంది.