
జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (కేరళ) జోడీ మహిళల డబుల్స్ విభాగంలో విజేతగా అవతరించింది. మంగళవారం పుణేలో జరిగిన ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–10, 21–9తో కావ్య గుప్తా–దీప్షిక సింగ్ (ఢిల్లీ) ద్వయంపై గెలిచింది.