క్వార్టర్స్‌లో సానియా జోడి | Sania Mirza team entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జోడి

Published Mon, Mar 10 2014 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

క్వార్టర్స్‌లో సానియా జోడి

క్వార్టర్స్‌లో సానియా జోడి

ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్‌పీ పారిబా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
 
  భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ ద్వయం 6-3, 6-4తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-జింబాబ్వే జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. జూలియా జార్జెస్-అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ), ఎలీనా వెస్నినా-మకరోవా (రష్యా) జోడిల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో సానియా ద్వయం తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement