indian wales
-
రన్నరప్ సానియా జోడి
బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీ ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా జోడి 6-7 (5/7), 2-6తో టాప్‌సీడ్ సై సువీ (తైవాన్)- పెంగ్ షువాయ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సానియా జంట ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. రెండో సెట్లో మాత్రం సై సువీ ద్వయం పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. -
ఫైనల్లో సానియా జోడి
ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో ఐదోసీడ్ సానియా-కారా 6-4, 3-6, 10-7తో ఎనిమిదోసీడ్ లూసి హర్డెకా (చెక్)-జీ జెంగ్ (చైనా)లపై విజయం సాధించారు. గంటా 37 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని అంశాల్లో సానియా ద్వయం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ సీజన్లో ఇండో-జింబాబ్వే జోడికి ఇదే తొలి ఫైనల్. ఈ టోర్నీకి ముందు జరిగిన నాలుగు ఈవెంట్లలో రెండింటిలో తొలి రౌండ్లో ఓడగా, మరో రెండింటిలో క్వార్టర్‌ఫైనల్ వరకు చేరారు. -
క్వార్టర్స్‌లో పేస్ జోడి
ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్పీ పారిబా ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్ (భారత్)-రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్లో పేస్-స్టెపానెక్ జంట 6-3, 7-5తో ఎల్రిచ్ (ఇజ్రాయెల్)-రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) జోడిపై నెగ్గింది. తదుపరి రౌండ్లో ఈ ఇండో-చెక్ జోడి రోజర్ ఫెడరర్-స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) జంటతో తలపడుతుంది. -
క్వార్టర్స్‌లో సానియా జోడి
ఇండియన్ వెల్స్ (అమెరికా): బీఎన్పీ పారిబా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 6-3, 6-4తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-జింబాబ్వే జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. జూలియా జార్జెస్-అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ), ఎలీనా వెస్నినా-మకరోవా (రష్యా) జోడిల మధ్య మ్యాచ్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో సానియా ద్వయం తలపడుతుంది.