ఫైనల్లో సానియా జోడి | Indian Wells: Sania Mirza-Cara Black storm into women's doubles final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సానియా జోడి

Published Sat, Mar 15 2014 1:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

Indian Wells: Sania Mirza-Cara Black storm into women's doubles final

ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్‌పీ పారిబా ఓపెన్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో ఐదోసీడ్ సానియా-కారా 6-4, 3-6, 10-7తో ఎనిమిదోసీడ్ లూసి హర్డెకా (చెక్)-జీ జెంగ్ (చైనా)లపై విజయం సాధించారు.
 
 గంటా 37 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అన్ని అంశాల్లో సానియా ద్వయం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ సీజన్‌లో ఇండో-జింబాబ్వే జోడికి ఇదే తొలి ఫైనల్. ఈ టోర్నీకి ముందు జరిగిన నాలుగు ఈవెంట్లలో రెండింటిలో తొలి రౌండ్‌లో ఓడగా, మరో రెండింటిలో క్వార్టర్‌ఫైనల్ వరకు చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement