ప్రాంజల ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్-2 టోర్నీలో తెలుగు అమ్మాయి ఎడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది.
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్-2 టోర్నీలో తెలుగు అమ్మాయి ఎడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 6-4, 6-2తో జోవిక్ నికోలినా (సెర్బియా)పై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ లో ప్రాంజల 7-6 (7/2), 6-2తో నటాలి కల్‌ముంజెరోవా (చెక్)ను ఓడించింది. బుధవారం జరిగే క్వార్టర్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెంగిజ్ బెర్ఫ్ (టర్కీ)తో తలపడుతుంది.
క్వార్టర్స్‌లో నిఖిత జోడి
చిలకలగూడ: చిదంబర అయ్యర్ స్మారక టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో సాయి నిఖిత జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. త్రివేండ్రంలో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయి నిఖిత-ఆస్థా బాబాసాహెబ్ ద్వయం 6-0, 6-1 తేడాతో కావ్యభరత్-పవిత్ర జంటపై గెలిచింది. సింగిల్స్ విభాగం లో మొదటి రౌండ్‌లో నాలుగో సీడ్ ఆరియాలి చవాన్‌పై 6-2, 6-2తో విజయం సాధించిన సాయినిఖిత.. రెండో రౌండ్‌లో డైనా అబీ చేతిలో పరాజయం పాలైంది. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన సాయి నిఖిత జాతీయ స్థాయిలో జరిగిన పలు టోర్నమెంట్లలో పాల్గొని అనేక టైటిళ్లను సొంతం చేసుకుంది.