మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవాలి | Sania Mirza wants to win Grand Slam in women's doubles | Sakshi
Sakshi News home page

మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవాలి

Published Fri, Nov 21 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవాలి

మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవాలి

సానియా ఆకాంక్ష
ముంబై: కెరీర్‌కు వీడ్కోలు చెప్పేలోగా మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలవాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోరుకుంటోంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ డబుల్స్ టైటిల్‌ను గెలిచినా... గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘మూడుసార్లు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచా. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌నూ గెలిచా.

ఇక మిగిలింది మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిలే. అందుకే దీనిపై దృష్టిపెట్టా’ అని సానియా వ్యాఖ్యానించింది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎలెనా వెస్నినా (రష్యా)తో కలిసి డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నా... రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది మహిళల డబుల్స్ భాగస్వామి సు వీ సీహ్ (చైనీస్‌తైపీ)తో కలిసి ఆడటంపై ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement