Indian tennis star Sania Mirza
-
ఆడాలంటే ఇంకో రెండు నెలలు ఆగాలి
తాను మళ్లీ రాకెట్ పట్టేందుకు కనీసం రెండు నెలలు సమయం ఉందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సానియా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఆటకు దూరమవడం... గత అక్టోబర్ నుంచి విశ్రాంతికే పరిమితమవడం తనకు అసహనం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. -
సానియా మీర్జా ‘స్వీట్ గర్ల్’...
* సచిన్ అంటే చాలా ఇష్టం * టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ప్రశంసలు కురిపించాడు. ‘గత ఏడాది సానియాతో కలిసి ఐపీటీఎల్‌లో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ ఆడాను. అంతకుముందు నుంచే ఆమె పరిచయం. అయితే ఆమెతో ఆడాక తనో స్వీట్ గర్ల్ అని అర్థమైంది. ఈ ఏడాది వింబుల్డన్ డబుల్స్ ఫైనల్ మొత్తం చూశాను. ఆమె అద్భుతంగా ఆడింది. సానియా-హింగిస్ జోడీకి ప్రతి టోర్నీలోనూ మద్దతు ఇస్తాను’ అని ఫెడరర్ చెప్పాడు. అలాగే భారత క్రీడాకారులలో తనకు క్రికెటర్ సచిన్ అంటే చాలా ఇష్టమన్నాడు. ‘వింబుల్డన్‌లో సచిన్‌ను కలిసి మాట్లాడాను. అతనో గొప్ప క్రీడాకారుడు. నేను ఎప్పుడు వీడియోగేమ్ క్రికెట్ ఆడినా తనని నా జట్టులో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా తీసుకుంటాను’ అని ఫెడరర్ అన్నాడు. ఐపీటీఎల్ ద్వారా భారత్‌కు వచ్చే అవకాశం మరోసారి లభించడం సంతోషంగా ఉందని ఈ స్టార్ ఆటగాడు చెప్పాడు. -
సూపర్ సానియా
ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో ఈ ఏడాది అంచనాలకు మించి రాణించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సీజన్‌ను గొప్ప విజయంతో ముగించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్‌తో కలిసి ఈ హైదరాబాద్ స్టార్ మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా సీజన్ ముగింపు టోర్నమెంట్‌ను వరుసగా రెండోసారి నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా సానియా కొత్త చరిత్ర సృష్టించింది. * రెండోసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ టైటిల్ సొంతం * ఈసారి హింగిస్‌తో కలిసి ఘనత * ఒక్క సెట్ కోల్పోకుండా జైత్రయాత్ర * సీజన్లో ఇండో-స్విస్ జోడీకిది తొమ్మిదో టైటిల్ సింగపూర్: ఎలాంటి సంచలనం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. టాప్ సీడ్ హోదాకు తగ్గట్టు రాణించిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జంట సానియా-హింగిస్ 6-0, 6-3తో ముగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్) జోడీని చిత్తుగా ఓడించింది. * కేవలం 66 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జంట పూర్తి ఆధిపత్యం చలాయించింది. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ ఇండో-స్విస్ జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సెట్లో ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. రెండో సెట్లో కాస్త పోటీ ఎదుర్కొన్న సానియా-హింగిస్ జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. * ఈ టోర్నమెంట్లో సానియా-హింగిస్ ద్వయం ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలువడం విశేషం. మొత్తం 61 గేమ్‌లు నెగ్గిన ఈ జోడీ ప్రత్యర్థులకు కేవలం 31 గేమ్‌లను సమర్పించుకుంది. గత 22 మ్యాచ్‌ల నుంచి సానియా జంటకు ఓటమి లేకపోవడం విశేషం. * గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత ప్రతిష్టాత్మక టోర్నీగా భావించే డబ్ల్యూటీఏ చాంపియన్‌షిప్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గడం సానియాకిది రెండోసారి. గతేడాది కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి సానియా ఈ టైటిల్‌ను సాధించగా... ఈసారి హింగిస్‌తో టైటిల్‌ను నిలబెట్టుకుంది. విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. * ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 32వ డబుల్స్ టైటిల్ కాగా.. ఈ ఏడాది 10వ టైటిల్. హింగిస్‌తో కలిసి తొమ్మిదోది. సానియా-హింగిస్ జంట ఈ ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్, చార్ల్స్టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ ఓపెన్, వుహాన్ ఓపెన్, బీజింగ్ ఓపెన్, డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీల్లో టైటిల్స్ సాధించింది. సిడ్నీ ఓపెన్‌లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. * మరోవైపు మార్టినా హింగిస్ కెరీర్లో ఇది 50వ డబుల్స్ టైటిల్. తద్వారా ఈ ఘనత సాధించిన 16వ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. ఈ జాబితాలో మార్టినా నవ్రతిలోవా, రోసీ కాసల్స్, పామ్ ష్రైవర్, బిల్లీ జీన్ కింగ్, జ్వెరెవా, లీసా రేమండ్, యానా నొ వోత్నా, అరంటా శాంచెజ్, గీగీ ఫెర్నాండెజ్, సుకోవా, లారిసా, కారా బ్లాక్, రెనీ స్టబ్స్, వెండీ టర్న్బాల్, లీజెల్ హుబెర్ ఉన్నారు. 1 సిడ్నీ ఓపెన్ భాగస్వామి: బెథానీ మాటెక్ (అమెరికా) ఫైనల్ ప్రత్యర్థి: రాకెల్ కాప్స్-అబిగేల్ స్పియర్స్ (అమెరికా); ఫైనల్ స్కోరు: 6-3, 6-3 2 ఇండియన్ వెల్స్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా) ఫైనల్ స్కోరు: 6-3, 6-4 3 మియామి ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా) ఫైనల్ స్కోరు: 7-5, 6-1 4 చార్ల్స్టన్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: డెలాక్వా (ఆస్ట్రేలియా)-జురాక్ (క్రొయేషియా); ఫైనల్ స్కోరు: 6-0, 6-4 5 వింబుల్డన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: మకరోవా-వెస్నినా (రష్యా) ఫైనల్ స్కోరు: 5-7, 7-6 (7/4), 7-5 6 యూఎస్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-ష్వె దోవా (కజకిస్తాన్); ఫైనల్ స్కోరు: 6-3, 6-3 7 గ్వాంగ్జూ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: షిలిన్ జు-జియోడి యు (చైనా) ఫైనల్ స్కోరు: 6-3, 6-1 8 వుహాన్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: ఇరీనా-మోనికా నికెలెస్కూ (రుమేనియా); ఫైనల్ స్కోరు: 6-2, 6-3 9 బీజింగ్ ఓపెన్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: హావో-యుంగ్ జాన్ (తైపీ) ఫైనల్ స్కోరు: 6-7 (9/11), 6-1, 10-8 10 డబ్ల్యూటీఏ ఫైనల్స్ భాగస్వామి: మార్టినా హింగిస్ ఫైనల్ ప్రత్యర్థి: ముగురుజా- కార్లా నవారో (స్పెయిన్); ఫైనల్ స్కోరు: 6-0, 6-3 ఏడేళ్ల తర్వాత... ఈ ఏడాది మార్చిలో మార్టినా హింగిస్‌తో కలిసి సానియా మీర్జా తొలిసారి బరిలోకి దిగింది. జంటగా ఆడిన తొలి టోర్నమెంట్ (ఇండియన్ వెల్స్)లోనే వీరికి టైటిల్ దక్కింది. ఆ తర్వాత వరుసగా మరో రెండు టోర్నీల్లో (మియామి, చార్ల్స్టన్) ఈ ద్వయం విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ క్రమంలో సానియా మీర్జా ఏప్రిల్‌లో డబుల్స్‌లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆరు టోర్నీల్లో సానియా-హింగిస్ ఆడినా వారికి టైటిల్ దక్కలేదు. వింబుల్డన్ టోర్నీలో టైటిల్ సాధించి ఈ జంట మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. టొరంటో, సిన్సినాటి టోర్నీల్లో వీరు విఫలమైనా... వెంటనే తేరుకొని ఆ తర్వాత వరుసగా నాలుగు టోర్నీల్లో టైటిల్స్ సంపాదించారు. ఈ క్రమంలో 2008 తర్వాత ఒకే సీజన్లో అత్యధికంగా తొమ్మిది టైటిల్స్ నెగ్గిన జంటగా సానియా-హింగిస్ గుర్తింపు పొందారు. 2008లో కారా బ్లాక్-లీజెల్ హుబెర్ ద్వయం 10 టైటిల్స్ సాధించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో సానియా-హింగిస్ జంట 16 టోర్నీల్లో బరిలోకి దిగి... తొమ్మిదింటిలో టైటిల్ సాధించింది. ఈ ఏడాది సానియా మీర్జా నలుగురు వేర్వేరు (సు వీ సెయి, బెథానీ మాటెక్, కేసీ డెలాక్వా, మార్టినా హింగిస్) భాగస్వాములతో 22 టోర్నమెంట్లలో బరిలోకి దిగి 65 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కోర్టు లోపలే కాదు బయట కూడా మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం, స్నేహం ఉంది. జీవితకాలం కష్టపడేది ఇలాంటి క్షణాల కోసమే. వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో సాధించిన ఈ విజయం అద్భుతం. ఆటతోపాటు అదృష్టం కూడా కలిసి రావడంతో ఈ ఏడాది మా జంటకు మంచి ముగింపు లభించింది. -సానియా మీర్జా ఈ రోజు మేమిద్దరం అద్భుతంగా ఆడాం. సానియా ఆటతీరును ఎంత ప్రశంసించినా తక్కువే. కోర్టులో అద్భుత కదలికలతో అనుక్షణం నాకు మద్దతుగా నిలిచింది. మంచి భాగస్వామి లభిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో సానియా నిరూపించింది. -మార్టినా హింగిస్ -
సానియా జంట శుభారంభం
సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం శుభారంభం చేసింది. సోమవారం జరిగిన డబుల్స్ ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-4, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో హలవకోవా-హర్డెకా (చెక్ రిపబ్లిక్)లతో సానియా-హింగిస్ తలపడతారు. -
ఫైనల్లో సానియా జంట
న్యూఢిల్లీ : గత రెండు టోర్నీల్లో విఫలమయ్యాక... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జతగా ఈ ఇద్దరూ నాలుగో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లారు. రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగిన సానియా-హింగిస్ జంట శనివారం జరిగిన సెమీఫైనల్లో 6-2, 7-6 (7/5)తో నాలుగో సీడ్ కరోలైన్ గార్సియా (ఫ్రాన్స్)-కాటరినా స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీపై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంటకు రెండో సెట్లో గట్టిపోటీ లభించినా కీలకమైన టైబ్రేక్‌లో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హింగిస్‌తో కలిసి ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్టన్ ఓపెన్లలో డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా... స్టట్గార్ట్ ఓపెన్‌లో రెండో రౌండ్లో... మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. -
ఎన్నో త్యాగాల ఫలితమిది
ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌పై సానియా వ్యాఖ్య ఏటికి ఎదురీది ఈ స్థాయికి వచ్చాను గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకం ‘ఫ్రెంచ్’ టైటిల్‌పై గురి చార్ల్స్టన్ (అమెరికా): చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా... ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తూ... తనతోపాటు కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాల ఫలితమే ‘ప్రపంచ నంబర్‌వన్’ ర్యాంక్ అని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా అధికారికంగా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. గతవారం మూడో ర్యాంక్‌లో ఉన్న సానియా తాజాగా 7,660 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకగా... నంబర్‌వన్‌గా ఉన్న సారా ఎరాని (ఇటలీ) 7,640 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్‌లో టైటిల్ నెగ్గిన తర్వాత సానియా మీర్జా పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.... హింగిస్ తోడ్పాటు అద్భుతం: నా కెరీర్లో గత ఐదు వారాలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడే సమయానికి నేను నంబర్‌వన్ ర్యాంక్‌కు 2,500 పాయింట్ల దూరంలో ఉన్నాను. అయితే మూడు టోర్నమెంట్లు ఆడాక నంబర్‌వన్ ర్యాంక్ దక్కడంతో నా ఆనందం రెట్టింపైంది. నా కల నిజం కావడంలో మార్టినా హింగిస్ సహకారం మరువలేను. ఈ మూడు టోర్నమెంట్ల సందర్భంగా కొన్ని కీలకదశల్లో ఆమె తోడ్పాటుతో గట్టెక్కాను. ఆమె గొప్ప చాంపియన్. ఈ ఘనత చిరకాలం: ప్రతికూలతలను అధిగమించి... నేను, నా కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాలకు నేడు తగిన గుర్తింపు లభించింది. ఈ ఘనతను నా నుంచి ఎవరూ తీసుకోలేరు. 50 ఏళ్ల తర్వాత కూడా నన్ను మాజీ నంబర్‌వన్ ప్లేయర్‌గానే గుర్తిస్తారు. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకం. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి నంబర్‌వన్ ర్యాంక్ సాధించాను. నా వంతుగా దేశానికి పేరు తెచ్చాను. ఏటికి ఎదురీదాను: ప్రస్తుతం నేను నా స్వీయచరిత్రను రాస్తున్నాను. దాని టైటిల్ పేరు ‘అగేనెస్ట్ ఆల్ ఆడ్స్’. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఆరేళ్ల వయస్సులో నేను రాకెట్ పట్టే సమయానికి ప్రత్యేకంగా క్లే కోర్టులు, హార్డ్ కోర్టులు లాంటివి లేవు. చెప్పుకుంటే వింతగా అనిపిస్తుంది కానీ ఆవు పేడతో తయారుచేసిన కోర్టుపై సాధన చేశాను. అలాంటి పరిస్థితుల నడుమ రాకెట్ చేతపట్టి ప్రపంచంలో అత్యున్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగడమంటే ఏటికి ఎదురీదాననే అనుకుంటున్నాను. ఏదైనా సాధ్యమే: పట్టుదల, గట్టి సంకల్పం ఉంటే సకల సౌకర్యాలు లేకపోయినా టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకొని అత్యున్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమే. ఐక్యరాజ్యసమితి దక్షిణాసియా మహిళల విభాగానికి నేను గుడ్‌విల్ అంబాసిడర్‌ను. ప్రతి మహిళ, అమ్మాయి తమని తాము ఓ శక్తిగా భావించాలే తప్ప బలహీనత అని అనుకోకూడదు. గట్టి సంకల్పంతో ముందుకు సాగుతూ త్యాగాలు చేస్తూ శ్రమిస్తే ఎలాంటి నేపథ్యం ఉన్న వాళ్లయినా అద్భుతాలు చేయగలరు. మరిన్ని విజయాలపై దృష్టి: మార్టినా హింగిస్‌తో భాగస్వామ్యం అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఆమెతో కలిసి వరుసగా మూడు టోర్నమెంట్లలో టైటిల్స్ గెలవడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మిక్స్డ్ డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించినప్పటికీ మహిళల డబుల్స్ విభాగంలో నా ఖాతాలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేదు. వచ్చే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ కొరత తీర్చుకునేందుకు తీవ్రంగా సాధన చేస్తాను. -
‘వన్’డర్ సానియా...
-
‘వన్’డర్ సానియా...
డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా భారత స్టార్ హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఈ సీజన్లో వరుసగా మూడో టైటిల్ రూ. 24 లక్షల 28 వేల ప్రైజ్‌మనీ సొంతం చార్ల్స్టన్ (అమెరికా): కల నిజమైంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అద్భుతం చేసింది. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆదివారం ముగిసిన ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలిసి సానియా విజేతగా నిలిచింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-0, 6-4తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-దరిజా జురాక్ (క్రొయషియా) జంటపై గెలిచింది. సానియా జంటకు 39 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 24 లక్షల 28 వేలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టైటిల్‌తో సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా అధికారికంగా నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకుంటుంది. హింగిస్‌తో కలిసి సానియాకిది వరుసగా మూడో టైటిల్ కావడం విశేషం. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఇండియన్ వెల్స్ ఓపెన్, మియామి ఓపెన్లలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత భారత్ తరఫున డబుల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన భారత ప్లేయర్‌గా సానియా నిలిచింది. అంతేకాకుండా అయ్ సుగియామ (జపాన్), షుయె పెంగ్ (చైనా), సెయి సు వీ (చైనీస్ తైపీ) తర్వాత మహిళల డబుల్స్‌లో ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా సానియా గుర్తింపు పొందింది. ‘‘ఏదో ఒక రోజున ప్రపంచ నంబర్‌వన్‌గా నిలవాలని ప్రతీ క్రీడాకారుడు కలలు కంటాడు. హింగిస్లాంటి క్రీడాకారిణితో కలిసి ఈ ఘనత సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో ఆడేందుకు వచ్చిన సమయంలో మా మదిలో ఒకటే లక్ష్యం ఉంది. అదే నంబర్‌వన్ కావడం. ఈ ఏడాది మరిన్ని టోర్నీల్లో గెలుస్తామని భావిస్తున్నాను.’’ -సానియా -
సానియా జంట శుభారంభం
ఫ్యామిలీ సర్కిల్ కప్ చార్ల్స్టన్ (అమెరికా) : వరుసగా రెండు టైటిల్స్‌తో జోరు మీదున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫ్యామిలీ సర్కిల్ కప్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా-హింగిస్ ద్వయం 6-7 (7/9), 6-3, 10-5తో అనస్తాసియా-అరీనా రొడియోనోవా (ఆస్ట్రేలియా) జంటపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. జోడీగా కలిసి ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంట తొలిసారి తమ ప్రత్యర్థి జోడీకి ఓ సెట్‌ను కోల్పోయింది. ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్లలో ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా టైటిల్స్ సొంతం చేసుకున్న వీరిద్దరికి ఈసారి గట్టిపోటీనే ఎదురైంది. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో సెట్లో తేరుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గి వరుసగా 11వ విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ ఫ్యామిలీ సర్కిల్ కప్‌లోనూ విజేతగా నిలిస్తే సానియా మీర్జా డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. ‘ఈ టోర్నీలో మా పార్శ్వంలోని ‘డ్రా’ కఠినంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మేము ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే క్లే కోర్టులపై జరుగుతున్న ఈ టోర్నీలో ఆడుతున్నాం. మా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాం. తొలి సెట్‌ను నెగ్గాల్సింది. అయితేనేం తొలిసారి సూపర్ టైబ్రేక్‌లో విజయాన్ని దక్కించుకున్నాం’ అని మ్యాచ్ అనంతరం సానియా వ్యాఖ్యానించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అనాబెల్ మెదీనా (స్పెయిన్)-ష్వెదోవా (కజకిస్థాన్) జంటతో సానియా జోడీ తలపడుతుంది. -
మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవాలి
సానియా ఆకాంక్ష ముంబై: కెరీర్‌కు వీడ్కోలు చెప్పేలోగా మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలవాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోరుకుంటోంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ డబుల్స్ టైటిల్‌ను గెలిచినా... గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘మూడుసార్లు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచా. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌నూ గెలిచా. ఇక మిగిలింది మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిలే. అందుకే దీనిపై దృష్టిపెట్టా’ అని సానియా వ్యాఖ్యానించింది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎలెనా వెస్నినా (రష్యా)తో కలిసి డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నా... రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది మహిళల డబుల్స్ భాగస్వామి సు వీ సీహ్ (చైనీస్‌తైపీ)తో కలిసి ఆడటంపై ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది.