సానియా జంట శుభారంభం | China Open: Sania Mirza-Martina Hingis Pair Enter Semifinals | Sakshi
Sakshi News home page

సానియా జంట శుభారంభం

Published Tue, Oct 27 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

సానియా జంట శుభారంభం

సానియా జంట శుభారంభం

సింగపూర్: డబ్ల్యూటీఏ ఫైనల్స్ చాంపియన్‌షిప్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం శుభారంభం చేసింది. సోమవారం జరిగిన డబుల్స్ ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ జోడీ 6-4, 6-2తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో-స్విస్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్‌లను కాపాడుకుంది. తమ తదుపరి లీగ్ మ్యాచ్‌లో హలవకోవా-హర్డెకా (చెక్ రిపబ్లిక్)లతో సానియా-హింగిస్ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement