
సానియా మీర్జా
తాను మళ్లీ రాకెట్ పట్టేందుకు కనీసం రెండు నెలలు సమయం ఉందని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమైన సానియా మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించింది. ఆటకు దూరమవడం... గత అక్టోబర్ నుంచి విశ్రాంతికే పరిమితమవడం తనకు అసహనం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.