దుబాయ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ డబ్ల్యూటీఏ -500 టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా బరిలోకి దిగిన సానియా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లూసీ రడెకాతో జతకట్టి, క్వార్టర్స్ లో జపనీస్-సెర్బియన్ జోడీ షుకో అయోమా, అలెక్సాండ్రా ను 7-5, 6-3 తేడాతో చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన సానియా జంట.. ఏ దశలోనూ ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో సానియా జోడీ టాప్ సీడ్ జోడీలైన ఎనా షిబహారా (జపాన్)-షుయ్ జాంగ్(చైనా), ల్యుడ్మైలా కిచెనాక్ (ఉక్రెయిన్)-జలెనా ఓస్టాపెంకో జంటల మధ్య పోటీలో విజేతతో తలపడుతుంది. సానియా (బెతాని మాట్టెక్ సాండ్స్‌తో జత కట్టి) 2013లో చివరిసారిగా ఈ టోర్నీ విజేతగా నిలిచింది.
చదవండి: మనీశ్ పాండే విధ్వంసం.. బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం
Dubai Championships: సెమీస్‌లో సానియా జోడీ
Published Thu, Feb 17 2022 10:04 PM | Last Updated on Fri, Feb 18 2022 9:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment